కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే రైతు సాధికారత

ABN , First Publish Date - 2022-05-25T05:45:21+05:30 IST

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతు సాధికారిత, ప్రజల ఆర్థికాభివృద్ధికి కృషిచేస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీమంత్రి సంబాని చంద్రశేఖర్‌ అన్నారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే రైతు సాధికారత
తల్లాడలో రచ్చబండ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న మాజీమంత్రి సంబాని

 టీ పీసీసీ ఉపాధ్యక్షుడు సంబాని

తల్లాడ/కల్లూరు మే 24: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతు సాధికారిత, ప్రజల ఆర్థికాభివృద్ధికి కృషిచేస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీమంత్రి సంబాని చంద్రశేఖర్‌ అన్నారు. మంగళవారం తల్లాడ మండలంలోని తల్లాడ, అన్నారుగూడెం, గోపాలపేట, మల్లవరం, బాలపేట గ్రామాల్లో మండల కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో వరంగల్‌ రైతు డిక్లరేషన్‌పై రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కాపా సుధాకర్‌ అధ్యక్షతన జరిగిన సభలో సంబాని మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యవసాయ వ్యతిరేక విధానాల వల్ల రైతులు వ్యయాప్రయాసలకోర్చి పండించిన పంటలకు గిట్టుబాటు దక్కడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల విషయంలో నాటకాలాడుతూ మోసాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రె్‌సను ప్రజలు ఆదరించి అధికారంలోకి తీసుకువస్తే 9రకాల వ్యవసాయ అనుకూల నిర్ణయాలతో కూడిన వరంగల్‌ డిక్లరేషన్‌ను తప్పకుండా అమలుచేసి రైతులను ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ దగ్గుల రఘుపతిరెడ్డి, మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు కాపా సుధాకర్‌, పెద్దబోయిన దుర్గాప్రసాద్‌, మనోహర్‌రెడ్డి, ఎర్రి కృష్ణారావు, చిత్తలూరి రమేష్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ దీవెల కృష్ణయ్య, మాజీ జడ్పీటీసీ కంచెపోగు వెంకటేశ్వర్లు, మువ్వా రోశయ్య, కటికి కిరణ్‌, భద్రు పాల్గొన్నారు.

కల్లూరు :  రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రైతును రాజులా చేసేలా పలు సంక్షేమ కార్యాక్రమాలు చెపడతామని టీపీసీసీ అధికార ప్రతినిధి కోటూరి మానవతరాయ్‌ చెప్పారు. మంగళవారం మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో వరంగల్‌ రైతు డిక్లేరేషన్‌ను గడప గడపకు తీసుకెళ్లేలా కార్యక్రమం నిర్వహించారు. ఆయన ప్రసంగిస్తూ రాష్ట్రంలో అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే వారిని ఆదుకోకుండా పక్క రాష్ట్రం పంజాబుకు వెళ్లి అక్కడి రైతులకు సీఎం కేసీఆర్‌ ఆర్ధిక సహయం చేయటం ఎంత వరకు సమర్ధనీయమన్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి రైతును రాజులా చేస్తే, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బిచ్చగాళ్లలా చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్‌ ప్రధాన కా ర్యదర్శి భూక్య శివకుమార్‌నాయక్‌, కాంగ్రెస్‌ నాయకులు దామాల రాజు, వల్లభనేని బాబు, పసుమర్తి మోహనరావు, కిసాన్‌సెల్‌ అధ్యక్షడు శీల బ్రహ్మారెడ్డి, ఎస్సీసెల్‌ అధ్యక్షుడు లాలయ్య, ఆ పార్టీ నాయకులు పాసం నాగేశ్వరరావు, వెకుంఠపు బాబురావు శివ నాయక్‌, సీతారాం పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-25T05:45:21+05:30 IST