Advertisement
Advertisement
Abn logo
Advertisement

తడుస్తున్న వేరుశనగ... ఆందోళనలో రైతులు


అనంతపురంరూరల్‌, అక్టోబరు25: ఇటీవల కురుస్తున్న వర్షాలకు వేరుశనగ పంట తడిసి ముద్దైపోతోంది. ఇటీవలే తొలగించి పొలాల్లో కుప్పలుగా వేసిన పంట కళ్లెదుటే తడిసి నల్లగా మారిపోతున్నా ఏమీ చేయలేని స్థితిలో రైతులు కలతచెందుతున్నారు. ఈ యేడు సకాలంలో వర్షాలు కురవకు దిగుబడి బాగా తగ్గిపోయింది. కనీసం పశువుల మేతకైన ఉపయోగపడుతుందిలే అనుకు న్నా రైతుల ఆశలపై వరుణుడు కన్నెర్రచేశాడు. మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి పంట మొత్తం తడిసి నల్లగా మారుతోందని అన్నదాతలు వాపోతున్నారు. గతే డాది వర్షాలు సరిగా కురవని కారణంగా పంట మొత్తం రొటావేర్‌తో కొట్టించేశాం... ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పంట దిగుబడి పూర్తిగా దెబ్బతింది. దీనికితోడు ఇప్పుడు కురుస్తున్న వర్షానికి కనీసం పశులమేతకు కూడా ఉపయోగపడని విధంగా కట్టి కుళ్లిపోపోతోందని వాపోతున్నారు. రోజూ కట్టిని చేనులో తిరగేస్తూనే ఉన్నా ప్రయోజనం లేదంటున్నారు. ఈ ఏడాది 10ఎకరాల్లో  రూ.4లక్షలు పెట్టుబడులు పెట్టి పంట సాగు చేశా. ఈసారి కూడా నష్టాలే మిగిలా యంటూ మండలంలోని ఇటుకలపల్లికి చెందిన రైతు రాజేంద్ర ఆవేదన వ్యక్తం చేశాడు. 


Advertisement
Advertisement