ఆ భయమక్కర్లేదు! ఇలా తీసుకుంటే..!

ABN , First Publish Date - 2022-08-10T20:15:18+05:30 IST

చాలా మంది పల్లీలు తినాలంటే అమ్మో ఫ్యాట్.. శరీరంలో కొవ్వు చేరుతుంది అని దూరంగా ఉంటారు. పల్లీలను

ఆ భయమక్కర్లేదు! ఇలా తీసుకుంటే..!

చాలా మంది పల్లీలు తినాలంటే అమ్మో ఫ్యాట్.. శరీరంలో కొవ్వు చేరుతుంది అని దూరంగా ఉంటారు. పల్లీలను తినని వారిని చాలా మందిని మనం నిత్యం చూస్తుంటాం. వారు ఆ అపోహను తొలగించుకోవాలి. పల్లీలను మోతాదులో తింటే ఏమీ కాదు. పల్లిలే కాదు.. ఫ్యాట్‌లేని వస్తువు ఏది అధికంగా తిన్నా నష్టమే. ఉడికించిన, వేయించినా పల్లీలు రుచిగా ఉంటాయి. వీటిని ఎక్కువ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భయంతో.. అసలు తినకుండానే మానేస్తారు. అది మంచిది కాదు. అప్పుడప్పుడు పల్లీలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. పల్లీల్లో విటమిన్లు, ఖనిజాలు, పోషక విలువలతో పాటు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం.


  • రోజు కొన్ని పల్లీలు తింటే శరీరంలో పేరుకుపోయిన చెడుకొవ్వు తొలగిపోతుంది. ఇందులోని మోనో శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ ప్రత్యేకించి ఓలిక్‌ యాసిడ్‌ గుండెజబ్బుల్ని రాకుండా అడ్డుకుంటుంది. 
  • పీనట్స్‌కు అత్యధిక ప్రొటీన్లు అందించే గుణం ఉంది. అమినో ఆసిడ్స్‌ శరీరారోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయి. 
  • ఈ రోజుల్లో ఉదరకోశ వ్యాధులు, పెద్ద చిన్న పేవులకొచ్చే క్యాన్సర్లు అధికం. పల్లీల్లోని పోలీ ఫినోనిక్‌ యాంటీ ఆక్సిడెంట్స్‌ కడుపులో వచ్చే క్యాన్సర్లను రానివ్వవు. నరాల జబ్బులు, వైరల్‌, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లనూ కూడా అడ్డుకుంటాయి. వీటిలోని నైట్రిక్‌ ఆక్సైడ్‌ గుండెపోటును రాకుండా కాపాడుతుంది.
  • శరీరానికి కొన్నిసార్లు బీ కాంప్లెక్స్‌ తక్కువై పలు సమస్యలు వస్తాయి. వేరుసెనగ తినేవాళ్లలో ఈ సమస్య తక్కువ. విటమిన్‌ బి6, బి9లతో పాటు మరిన్ని విటమిన్లు అందుతాయి. 
  • పోటాషియం, మెగ్నీషియం, కాపర్‌, కాల్సియం, ఐరన్‌, సెలీనియమ్‌, జింక్‌ వంటి ఖనిజాలకు వేరుసెనగలో కొదవ లేదు. శరీరంలోని అన్ని అవయవాలకు తగిన శక్తిని అందిస్తుంది వేరుసెనగ. 
  • విదేశాల్లో పీనట్స్‌తో తయారైన బటర్‌ను విరివిగా వాడుతుంటారు. ఈ రకం బటర్‌ వల్ల గాల్‌బ్లాడర్‌ జబ్బులు దరిచేరవట. 25 శాతం రిస్క్‌ తక్కువని పరిశోధనలు చెబుతున్నాయి. 
  • ముఖ్యంగా మహిళలు పీనట్స్‌ బటర్‌ను వారానికి రెండుసార్లు బ్రెడ్‌స్లయిసె్‌సకు రాసుకొని తింటే మంచిది. కొలోన్‌ క్యాన్సర్‌ ముప్పు తప్పుతుంది. ఈ విషయం పలు పరిశోధనల్లో రుజువైంది. 
  • శరీరంలోని మెటాబాలిజాన్ని చురుగ్గా ఉంచి... షుగర్‌లెవెల్స్‌ను చక్కదిద్ది... ఆరోగ్యంగా ఉంచుతుంది వేరుసెనగ. 
  • సెరటోనిన్‌ లెవల్స్‌ పడిపోతే... డిప్రెషన్‌కు లోనయ్యే ప్రమాదం ఉంది. ఆ లోటును తీరుస్తుంది పల్లీ. ఇవేకాదు, చర్మకాంతికి, జుట్టు నిగనిగలాడేందుకు పల్లీలు ఎంతో ప్రయోజనం 


(నార్సింగ్‌- ఆంధ్రజ్యోతి)  

Updated Date - 2022-08-10T20:15:18+05:30 IST