భారీ వర్షాలకు దెబ్బతిన్న వేరుశనగ పంట

ABN , First Publish Date - 2021-10-26T06:11:33+05:30 IST

మండలంలో నాలుగు రోజల నుంచి కు రుస్తున్న వర్షాలకు వేరుశనగ పంట పూర్తిగా దెబ్బతినింది. రూ.లక్షల్లో రైతు లు పంటను నష్టపోతున్నారు.

భారీ వర్షాలకు దెబ్బతిన్న వేరుశనగ పంట
కుందుర్పిలో తడిసిన పంటను ఆరబెడుతున్న దృశ్యం

విడపనకల్లు, అక్టోబరు 25: మండలంలో నాలుగు రోజల నుంచి కు రుస్తున్న వర్షాలకు వేరుశనగ పంట పూర్తిగా దెబ్బతినింది. రూ.లక్షల్లో రైతు లు పంటను నష్టపోతున్నారు. చీకలగురికి, ఉండబండ, వేల్పుమడుగు, కరకముక్కల, హావళగి, పాల్తూరు గ్రామాల్లోని ఎర్రనేల పొలాల్లో సాగు చేసి న వేరుశనగ పంట వర్షంతో నీటిపాలైంది. చేతికొచ్చిన పంటను తొలగించ కపోతే కాయలు నేలలోనే మొలకలు పోయి పూర్తిగా నాశనం అయిపోతుందని తొలగిస్తున్నట్లు రైతులు తెలిపారు. వేరుశనగ పొట్టు నల్లబారితే పశువులకు మేతకు కూడా పనికి రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికి వచ్చిన పంట కళ్ల ఎదురుగా కుళ్లి పోతుండటాన్ని చూసి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. వర్షాలు ఇలాగే వస్తే పప్పుశనగ పంట కూడా కుళ్లి పోతుందని వాపోతున్నారు. ఎక్కువ తేమ కావటంతో మిర్చి పంటలకు కూడా దెబ్బ పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.


పెట్టుబడులూ దక్కని వైనం

కుందుర్పి: మండలంలో ఖరీ్‌ఫలో సాగైన వేరుశనగ పంటను వర్షం నిండాముంచింది. వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి పొలాల్లో వు న్న వేరుశనగ పంట పూర్తిగా దెబ్బతిని చేతికందని పరిస్థితి నెలకొంది. కొం తమంది పంటను కోతకొసి పొలాల్లో కుప్ప పోశారు. రోజూ కురుస్తున్న వ ర్షానికి బూజుపట్టే పరిస్థితి నెలకొందని పలువురు రైతులు ఆందోళన చెం దుతున్నారు. కనీసం పశువులకు మేతకూడా దొరకదని వాపోతున్నారు.  ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 


పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి : సీపీఐ

కూడేరు: ఖరీ్‌ఫలో వేరుశనగ పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని సీపీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానికంగా రైతు సంగప్ప సాగుచేసిన వేరుశనగ పంటను వారు పరిశీలించారు. వేరుశనగ పంట సాగు చేసిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నా యకులు మల్లికార్జున, పెరుగు సంగప్ప, రమణ, రమణప్ప, శ్రీరాములు, వెంకటేశులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-26T06:11:33+05:30 IST