- కపాలీశ్వరాలయ కొలనులో గాలింపు
- అత్యాధునిక పరికరాల వినియోగం
పెరంబూర్(చెన్నై): స్థానిక మైలాపూర్ కపాలీశ్వరాలయ కొలనులో వున్నట్లుగా భావిస్తున్న నెమలి విగ్రహం అన్వేషణ కోసం అత్యాధునిక పరికరాల్ని వినియోగిస్తున్నారు. ఆ ఆలయంలో 2004లో కుంభాభిషేకం నిర్వహించిన అనంతరం, పున్నైవందార్ సన్నిధిలో ఉంచిన నెమిలి విగ్రహం అదృశ్యమైందని, దాని స్థానంలో మరో విగ్రహం పెట్టారని శ్రీరంగానికి చెందిన రంగరాజన్ నరసింహన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అలాగే, కొత్త విగ్రహాన్ని తీసివేసి, పాత విగ్రహాంతో కుంభాభిషేకం నిర్వహించేలా ఉత్తర్వులు జారీచేయాలని పిటిషన్లో కోరారు. ఈ విషయమై హైకోర్టు ఉత్తర్వులతో విగ్రహాల అక్రమ తరలింపు నిరోధక విభాగం దాఖలు చేసిన అఫిడివిట్లో, ఆ నెమలి విగ్రహం తెప్పకొలనులో దాచినట్లు సమాచారం ఉందని, ఆ విగ్రహం కోసం కొలను పూర్తిగా గాలించకుండా అత్యాధునిక పరికరంతో విగ్రహ ఆచూకీ తెలుసుకుంటామన్నారు. ఈ వాదన పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం, రెండు వారాల అవకాశం కల్పించింది. అనంతరం కొలనులో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలించి సర్పవిగ్రహం మాత్రమే గుర్తించారు. ఈ నేపథ్యంలో, జాతీయ సముద్రతీర పరిశోధన కేంద్రం అందించిన అత్యాధునిక పరికరాల ద్వారా నెమిలి విగ్రహం గాలించే పనులు సోమవారం ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి