Abn logo
Mar 2 2021 @ 21:12PM

ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ : డీఎస్పీ

నాయుడుపేట, మార్చి 2 : నాయుడుపేట రెవెన్యూ డివిజన్‌లోని నాయుడుపేట, సూళ్లూరుపేట మున్సిపాలిటీలలో మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు పటిష్ఠమైన చర్యలు చేపట్టినట్లు గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి అన్నారు. నాయుడుపేట మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం మున్సిపల్‌ ఎన్నికల ఉపసంహరణలను ఆయన పరిశీలించారు. ప్రశాంతంగా పోలింగ్‌ జరిగేందుకు బందోబస్తుతోపాటు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌, ఆర్మడ్‌ పోలీసు బలగాలు సిద్ధం చేసినట్లు తెలిపారు.బ్యాలెట్‌ బాక్సులు భద్రపరిచేందుకు స్ట్రాంగ్‌ రూములను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డీఎస్పీ వెంట కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, సీఐ వేణుగోపాల్‌రెడ్డి, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఉన్నారు. 


Advertisement
Advertisement
Advertisement