ఎస్‌ఆర్‌ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ధర్నా

ABN , First Publish Date - 2021-07-31T05:18:30+05:30 IST

ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందకుండానే అడ్మిషన్లు చేస్తూ రూ. వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్న ఎస్‌ఆర్‌ కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం పీడీఎస్‌యూ నాయకులు చింతారెడ్డిపాలెంలో ఉన్న ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల ఎదుట ధర్నా నిర్వహించారు.

ఎస్‌ఆర్‌ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ధర్నా
ధర్నా చేస్తున్న పీడీఎస్‌యూ నాయకులు

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), జూలై 30: ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందకుండానే అడ్మిషన్లు చేస్తూ రూ. వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్న ఎస్‌ఆర్‌ కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం  పీడీఎస్‌యూ  నాయకులు చింతారెడ్డిపాలెంలో ఉన్న ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల  ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ిఆ సంఘ నెల్లూరు రూరల్‌ కమిటీ అధ్యక్షుడు ఎస్‌కె షారుఖాన్‌ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఇంటర్‌ అడ్మిషన్లపై ప్రకటన రాకముందే ఎస్‌ఆర్‌ విద్యాసంస్థలు ఇంటర్‌ అడ్మిసన్లు చేస్తున్నాయన్నారు. ఇప్పటికే ఇంటర్‌ విద్యాశాఖ అధికారులకు ఈ విద్యాసంస్థలపై ఫిర్యాదు చేసినా స్పందించ లేదన్నారు. వెంటనే అనుమతులు లేని ఈ విద్యాసంస్థలపై చర్యలు చేపట్టాలని, లేకుంటే  ఆందోళనలు ఉద్రికత్తం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆ సంఘ రూరల్‌ కార్యదర్శి ఆశిర్వాదం పాల్గొన్నారు.


Updated Date - 2021-07-31T05:18:30+05:30 IST