అక్రమ రేషన్‌బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-04-17T05:55:08+05:30 IST

అక్రమ తరలిస్తున్న రేషన్‌ బియ్యం వ్యాన్‌ను రెవెన్యూ అధికారులు శుక్రవారం రాత్రి గుర్తించి సీజ్‌ చేశారు.

అక్రమ రేషన్‌బియ్యం పట్టివేత
అక్రమంగా బియ్యం తరలిస్తున్న మినీ వ్యాన్‌

మినీ వ్యాన్‌లో తరలిస్తున్న 50 క్వింటాళ్ళ బియ్యం 

వ్యాన్‌కు పంచర్‌ పడడంతో గుట్టు రట్టు

కనిగిరి, ఏప్రిల్‌ 16: అక్రమ తరలిస్తున్న రేషన్‌ బియ్యం వ్యాన్‌ను రెవెన్యూ అధికారులు శుక్రవారం రాత్రి గుర్తించి సీజ్‌ చేశారు. అధికారులు తెలిపిన వివరాల మేరకు... కనిగిరి నుంచి పోదిలి వైపు ఏపీ 39టీఎం7425 నంబరు లోని మినీ వ్యాన్‌లో దాదాపు 50 క్వింటాళ్ల అక్రమ బియ్యం తరలిస్తున్నారు. కనిగిరి నుంచి పొదిలి వైపు వెళ్తుండగా మార్గమధ్యలో నందన మారెళ్ల వద్ద వ్యాన్‌కు పంచర్‌ అయ్యింది. దీంతో స్థానికులకు అనుమానం వచ్చి సీపీఎం నాయకులు పీసీ కేశవరావుకు సమాచారం అందించారు. పట్టణంలోని శంకవరం గ్రామానికి చెందిన వ్యాన్‌డ్రైవర్‌ హేమాద్రిని ఎక్కడ నుంచి ఎక్కడి కి బియ్యం తరలిస్తున్నారని విచారించారు. వ్యాన్‌కు తాను డ్రైవర్‌ను మాత్రమేనని ఆనంద్‌ అనే వ్యక్తి వ్యానును పొదిలిలో ఇచ్చి రావాలని కోరడంతో వచ్చినట్లు తెలిపారు. దీంతో అనుమానం వచ్చి వ్యాన్‌పై ఉన్న టార్పాలిన్‌ పట్టా తొలగించగా రేషన్‌బియ్యంగా గుర్తించి రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రెవెన్యూ అధికారులు నందన మారెళ్ల గ్రామం వద్దకు వచ్చి అక్రమ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసి వ్యాన్‌ను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Updated Date - 2021-04-17T05:55:08+05:30 IST