పీడీఎఫ్‌ మేనేజర్‌ డౌన్‌లోడింగ్‌ ఉచితం

ABN , First Publish Date - 2021-07-03T05:31:49+05:30 IST

మైక్రోసాఫ్ట్‌ పీడీఎఫ్‌ మేనేజర్‌ను ఈ రోజు ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రూ.2700 విలువైన ఇది

పీడీఎఫ్‌ మేనేజర్‌ డౌన్‌లోడింగ్‌ ఉచితం

మైక్రోసాఫ్ట్‌ పీడీఎఫ్‌ మేనేజర్‌ను ఈ రోజు ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రూ.2700 విలువైన ఇది యూనివర్సల్‌ విండో ప్లాట్‌ఫారం. మైక్రోసాఫ్ట్‌ స్టోర్‌లో ఇది ఉంది. ‘ఎసెన్షియల్‌ యాప్‌’లో ఇది భాగం. 


 స్టార్ట్‌ మెనూ నుంచి మైక్రోసాఫ్ట్‌ స్టోర్‌ను ఓపెన్‌ చేయాలి. 

 సెర్చ్‌ బటన్‌ క్లిక్‌ చేసి పీడీఎఫ్‌ మేనేజర్‌ అని టైప్‌ చేయాలి.

 సజెషన్‌ లిస్ట్‌లో ‘పీడీఎఫ్‌ మేనేజర్‌ - మెర్జ్‌, స్ప్లిట్‌, ట్రిమ్‌’ అని కనిపిస్తుంది. 

 బ్లూ బటన్‌పై క్లిక్‌ చేసి యాప్‌ ఇన్‌స్టాల్‌ అయ్యే వరకు ఆగాలి. ఒకసారి ఇన్‌స్టాల్‌ అయిన తరవాత కంటిన్యూ అయ్యేందుకు లాంచ్‌పై క్లిక్‌ చేయాలి. 

దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు మైక్రోసాఫ్ట్‌ అకౌంట్‌లో సంతకం చేయాలి. సిస్టమ్‌పై ఓపెన్‌ చేసిన మైక్రోసాఫ్ట్‌ అకౌంట్‌ నుంచే లాగ్‌ అవ్వాలి. తదుపరి మాత్రమే ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని అనుకుంటున్న డివైస్‌ను సెలెక్ట్‌ చేసుకోవాలి. 


మెర్జ్‌, స్ప్లిట్‌, ఎక్స్‌ట్రాక్ట్‌, పీడీఎఫ్‌ల కంబైన్‌ చేసేందుకు పీడీఎఫ్‌ మేనేజర్‌ ఉపయోగపడుతుంది. దీన్ని సులువుగా ఉపయోగించుకోవచ్చు. పీడీఎఫ్‌ ఫైల్స్‌ మెర్జింగ్‌, ఎడిటింగ్‌కు ఉపయోగపడుతుంది. వేర్వేరు డాక్యుమెంట్ల నుంచి మెర్జ్‌, రికార్డర్‌, పేజీలను విడదీయడం చేయవచ్చు. కొద్దిపాటి క్లిక్స్‌తో ఎక్స్‌ట్రాక్ట్‌, రొటేట్‌, డిలీట్‌, కలిపేయడం చేసుకోవచ్చు. తమ వద్ద ఉన్న పీడీఎఫ్‌ ఫైల్స్‌కు పాస్‌వర్డ్‌ కలపడం, తీసేయడం వంటి పనులు చేయవచ్చు. డూప్లికేట్‌, షేర్‌కు తోడు ఎడిట్‌ చేసిన పీడీఎఫ్‌లను ప్రింట్‌ చేసుకోవచ్చు. ఫుల్‌ స్ర్కీన్‌ పీడీఎఫ్‌ రీడర్‌ కూడా ఉంది. 


మైక్రోసాఫ్ట్‌ పీడీఎఫ్‌ మేనేజర్‌ పొందేందుకు ముఖ్యంగా 

ఓఎస్‌: ఎక్స్‌బాక్స్‌ వన్‌, విండోస్‌ 10 వెర్షన్‌ 10586.0 లేదా అంతకు మించి

ఆర్కిటెక్చర్‌: ఎఆర్‌ఎం, ఎక్స్‌64, ఎక్స్‌ 86 

సిస్టమ్‌ రిక్వైర్‌మెంట్స్‌ పూర్తిగా బేసిక్‌ 


Updated Date - 2021-07-03T05:31:49+05:30 IST