నకిలీ పత్తి విత్తన విక్రేతపై పీడీ యాక్టు

ABN , First Publish Date - 2021-12-03T06:52:35+05:30 IST

నకిలీ పత్తి విత్తనా లు, ఇతర పద్ధతుల్లో రైతులను మోసం చేస్తున్న హైదరాబాద్‌ బోయినపల్లికి చెంది న ఎనబోతుల శ్రీనివా్‌సరెడ్డి పై నల్లగొండ టూటౌన పోలీ సులు పీడీ యాక్టు కేసు న మోదు చేశారు.

నకిలీ పత్తి విత్తన విక్రేతపై పీడీ యాక్టు
శ్రీనివాస్‌రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలిస్తున్న సీఐ చంద్రశేఖర్‌రెడ్డి

నకిలీ పత్తి విత్తన విక్రేతపై పీడీ యాక్టు

 చంచల్‌గూడ జైలుకు తరలింపు

శ్రీనివాస్‌రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలిస్తున్న సీఐ చంద్రశేఖర్‌రెడ్డి  

నల్లగొండ క్రైం, డిసెంబరు 2: నకిలీ పత్తి విత్తనా లు, ఇతర పద్ధతుల్లో రైతులను మోసం చేస్తున్న హైదరాబాద్‌ బోయినపల్లికి చెంది న ఎనబోతుల శ్రీనివా్‌సరెడ్డి పై నల్లగొండ టూటౌన పోలీ సులు పీడీ యాక్టు కేసు న మోదు చేశారు. శ్రీనివా్‌సరెడ్డిని హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు తరలించా రు. సీఐ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివా్‌సరెడ్డి నకిలీ పత్తి విత్తనాలను ప్యాకెట్లు, సంచుల్లో నింపి కంప్యూటర్‌ ద్వారా మోనోగ్రామ్‌, సీళ్లను తయారు చేసి, అధిక ధరలకు విక్రయించి రైతులను మోసం చేస్తున్నాడన్నారు. 2016లో మేడ్చల్‌ జిల్లా గుండ్లపోచంపల్లి గ్రామంలో నైరుతి సీడ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ పేరుతో ఎనుబోతుల శ్రీనివా్‌సరెడ్డి ఒక కంపెనీ ఏర్పాటు చేశాడన్నారు. 2021లో ఐసీఏఆర్‌ నుంచి మెమో ఆఫ్‌ అండర్‌స్టాండింగ్‌ పొందినా ఐసీఏఆర్‌-సీఐసీఆర్‌ నుంచి బ్రీడర్‌సీడ్స్‌ తీసుకోకుండా, ఫౌండేషన సీడ్స్‌ ప్రొడక్షన చేయకుండా వివిధ ఏరియాల్లో కొనుగోలు చేసి, నైరుతి సీడ్స్‌ గోడౌన గుండ్లపోచంపల్లి, ఇతరుల వద్ద నిల్వ చేసి వాటి నుంచి శాం పిల్స్‌ సేకరించడం కానీ గ్రో అవుట్‌ టెస్ట్‌ చేయకుండా, రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెం ట్‌ సెంటర్‌లో పరీక్ష చేయకుండానే మొలక శాతం 90శాతం, కాయ నాణ్యత 90 శాతం అని లేబుల్‌ వేయించినట్లు తెలిపారు. ఫిజికల్‌ ఫ్యూరిటీ చూడకుండా, ఆ సీడ్స్‌ రసాయనాలు పూసిన నకిలీ విత్తనాలను ఐసీఏఆర్‌-సీఐసీఆర్‌కు చెందిన మోనోగ్రామ్‌ను, జీఓటీ లేకుండా ట్రూతఫుల్‌ లేబుల్‌ తయారు చేస్తున్నారన్నారు. నకిలీ సీళ్లను ఖాళీ ప్యాకెట్లు, సంచుల మీద ప్రింట్‌ చేసి నకిలీ పత్తి విత్తనాలను ప్యాకెట్‌ లో 475 గ్రాముల పత్తి విత్తనాలు నింపి దానిపై రూ.767 ధర ముద్రించి రూ. 600కు రైతులకు మార్కెటింగ్‌  బ్రోకర్స్‌ ద్వారా డీలర్స్‌, రైతులకు అమ్ముతూ మోసం చేశాడన్నారు. శ్రీనివా్‌సరెడ్డిపై నల్లగొండ రూరల్‌ 1, చండూరు 1, దేవరకొండ 1 కేసులు నమోదయ్యాయని, కలెక్టర్‌ ఆదేశాల ప్రకారం శ్రీనివా్‌సరెడ్డిపై పీడీ యాక్టు నమోదు చేసి గురువారం చంచల్‌గూడ జైలుకు తరలించామన్నారు. 


Updated Date - 2021-12-03T06:52:35+05:30 IST