రౌడీ, సస్పెక్ట్ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న సీఐ రమేష్‌బాబు
- గోదావరిఖని వన్‌టౌన్ సీఐ రమేష్‌బాబు
కోల్‌సిటీ, జనవరి 18: రౌడీషీటర్లు తమ ప్రవర్తను మార్చుకుని సత్పవర్తనతో మెలగకపోతే పీడీ యాక్టు నమోదు చేస్తామని గోదావరిఖని వన్‌టౌన్ సీఐ రమేష్‌బాబు హెచ్చరించారు. మంగళవారం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో 24మంది రౌడీషీటర్లు, 28మంది సస్పెక్ట్ షీటర్లు, ఒక డీసీకి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వారు తమ నేర ప్రవృత్తిని వీడి మంచి ప్రవర్తనతో మెలగాలన్నారు. తీరు మార్చుకోకపోతే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సత్పవర్తనతో మెలిగే వారికి భవిష్యత్‌లో షీట్లు తొలగిస్తామన్నారు. ఎస్‌ఐలు రమేష్, సుబ్బారావు, స్వామి, కానిస్టేబుళ్లు తీట్ల శ్రీనివాస్, రమేష్, జంపన్న, హోమ్‌గార్డు నాగరాజు పాల్గొన్నారు.