ముగ్గురు సారా తయారీదారులపై పీడీ యాక్టు

ABN , First Publish Date - 2022-08-17T05:36:14+05:30 IST

జిల్లాలో నాటుసారా తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులపై పోలీసులు పీడీ యాక్టు నమోదు చేసినట్టు ఎస్పీ సిద్దార్థ కౌశల్‌ తెలిపారు.

ముగ్గురు సారా  తయారీదారులపై పీడీ యాక్టు

  1. నేర ప్రవృత్తి మార్చుకోకపోతే కఠిన చర్యలు 
  2. ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ 

కర్నూలు, ఆగస్టు 16: జిల్లాలో నాటుసారా తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులపై పోలీసులు పీడీ యాక్టు నమోదు చేసినట్టు ఎస్పీ సిద్దార్థ కౌశల్‌ తెలిపారు. స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆదోని బసాపురం గ్రామానికి చెందిన ఎరుకుల మునిస్వామి అలియాస్‌ మునిస్వామిపై మొత్తం పది కేసులు ఉన్నాయి. ఇస్వీ పోలీ్‌సస్టేషనలో 6, ఆదోని సెబ్‌ పోలీ్‌సస్టేషనలో నాలుగు కేసులు ఉన్నాయి. అలాగే ఆదోని వాల్మీకి నగర్‌కు బోయదానప్పపై ఆదోని త్రీటౌన పోలీ్‌సస్టేషనలో మొత్తం 6 కేసులు ఉన్నాయి. మద్దికెర మండలం పెరవళి గ్రామానికి చెందిన చిప్పగిరి గోవిందప్పపై మద్దికెర పోలీ్‌సస్టేషన పరిధిలో 6 కేసులు ఉన్నాయి. వీరిపై పలుమార్లు క్రిమినల్‌ కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినా కూడా వీరి ప్రవర్తనలో మార్పు రాలేదని ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపగా ఆయన ఈ ముగ్గురిపై పీడీ యాక్టు ఉత్తర్వులు జారీ చేశారన్నారు. అలాగే గతంలో కూడా ఏప్రిల్‌లో ఆదోనికి చెందిన ఓలుమన్న, బోయ రంగన్న, కర్నూలుకు చెందిన కల్లి కోట కృష్ణలపై పీడీ యాక్టులు నమోదు చేశామన్నారు. నేర ప్రవృత్తి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ముగ్గురు వ్యక్తులపై పీడీ యాక్టు నమోదు చేసి కడప సెంట్రల్‌ జైలుకు తరలించామని తెలిపారు.

సైబర్‌ నేరాల నివారణకు చర్యలు తీసుకోవాలి 

సైబర్‌ నేరాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ సిద్దార్థ కౌశల్‌ పోలీసు అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో పోలీస్‌ అధికారులతో ఆయన నెలవారి సమక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షలో అడిషినల్‌ ఎస్పీ అడ్మిన డి.ప్రసాద్‌, లీగల్‌ అడ్వైజర్‌ మల్లికార్జున రావు, డీఎస్పీలు శ్రీనివాసులు, వినోద్‌ కుమార్‌, యుగందర్‌బాబు, మహేష్‌, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-17T05:36:14+05:30 IST