Umrah: విదేశీ యాత్రికుల విషయమై సౌదీ అరేబియా కీలక ప్రకటన

ABN , First Publish Date - 2022-08-03T17:37:37+05:30 IST

ఉమ్రా యాత్ర (Umrah pilgrimage)కు వచ్చే విదేశీ యాత్రికుల విషయమై సౌదీ అరేబియా (Saudi Arabia) తాజాగా కీలక ప్రకటన చేసింది.

Umrah: విదేశీ యాత్రికుల విషయమై సౌదీ అరేబియా కీలక ప్రకటన

రియాద్: ఉమ్రా యాత్ర (Umrah pilgrimage)కు వచ్చే విదేశీ యాత్రికుల విషయమై సౌదీ అరేబియా (Saudi Arabia) తాజాగా కీలక ప్రకటన చేసింది. విదేశాల నుంచి ఉమ్రా కోసం వచ్చే యాత్రికులకు (Pilgrims) సౌదీ అరేబియాలో ప్రవేశించడానికి పీసీఆర్ పరీక్ష (PCR Test)  అవసరం లేదని హజ్, ఉమ్రా మంత్రిత్వశాఖ (Ministry of Hajj and Umrah) స్పష్టం చేసింది. కానీ, కరోనా బారినపడితే చికిత్స వ్యయాన్ని కవర్ చేయడానికి బీమా తీసుకోవాలనే నిబంధన ఇప్పటికీ అలాగే ఉందని ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ గుర్తు చేసింది. ఇక ఉమ్రా వీసాపై వచ్చేవారి బస వ్యవధి 90 రోజులు మాత్రమేనని తెలిపింది. యాత్రికుడు మదీనా, మక్కాతో పాటు అన్ని ఇతర సౌదీ నగరాల మధ్య ప్రయాణించే వెసులుబాటు ఉంటుందని వెల్లడించింది. 


ఇక మంత్రిత్వశాఖ విదేశీ యాత్రికుల కోసం తీసుకొచ్చిన ఉమ్రా ట్రిప్ ప్రొగ్రామ్ ద్వారా వారు మధ్యవర్తి లేకుండా నేరుగా https://maqam.gds.haj.gov.sa/Home/OTAs లింక్ ద్వారా నేరుగా ఉమ్రా పర్మిట్‌ను బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. వ్యాక్సిన్ తీసుకోని యాత్రికులకు కూడా యాత్రకు అవకాశం ఇస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ వెల్లడించింది. అయితే, టీకా వేసుకోని యాత్రికులు ఈట్‌మార్నా యాప్ ద్వారా ప్రత్యేకంగా ఉమ్రా పర్మిట్లు పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.  


Updated Date - 2022-08-03T17:37:37+05:30 IST