ఆసియాకప్ నిర్వహణ విషయంలో పాక్ సంచలన నిర్ణయం?

ABN , First Publish Date - 2020-02-21T00:24:33+05:30 IST

ఈ ఏడాది సెప్టెంబరులో జరగనున్న ఆసియాకప్ టీ20 టోర్నీ విషయంలో పాకిస్థాన్ సంచలన

ఆసియాకప్ నిర్వహణ విషయంలో పాక్ సంచలన నిర్ణయం?

లాహోర్: ఈ ఏడాది సెప్టెంబరులో జరగనున్న ఆసియాకప్ టీ20 టోర్నీ విషయంలో పాకిస్థాన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈసారి ఆసియాకప్ టీ20 టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తోంది. అయితే, ఈ టోర్నీకి భారత జట్టును పాకిస్థాన్ పంపబోమని బీసీసీఐ ఇప్పటికే తేల్చి చెప్పింది. టోర్నీని తటస్థ వేదికపై నిర్వహిస్తే టీమిండియాను పంపడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని పేర్కొంది. టోర్నీలో భారత జట్టు ఉండాలంటే ఆసియాకప్ వేదిక పాకిస్థాన్ కాకూడదని స్పష్టం చేసింది.


తమ జట్టును పంపేది లేదని బీసీసీఐ స్పష్టంగా చెప్పేయంతో ఆతిథ్య హక్కులను వదులుకోవాలని పీసీబీ నిర్ణయించినట్టు సమచారం. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ట్రోఫీ ఆవిష్కరణ సందర్భంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ ఎహ్‌సాన్ మణి మాట్లాడుతూ.. ఆసియా కప్ టీ20 టోర్నీ ఆతిథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు అర్థం వచ్చేలా మట్లాడారు.


ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)లోని సభ్యదేశాల్లోని అత్యధిక మంది అభిప్రాయం ప్రకారం ఆసియాకప్ వేదిక నిర్ణయం అవుతుందన్నారు. భాగస్వామ్య దేశాల ఆదాయాలు ప్రభావితం కాకుండా చూసుకోవాల్సి ఉందన్నారు. తన ఉద్దేశం అందిరి గురించి కాదని, కొన్ని దేశాల గురించే చెబుతున్నాననంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.


మార్చి తొలివారంలో ఏసీసీ సమావేశం అవుతుందని, అప్పుడే వేదిక, ఇతర వివరాలు ఓ కొలిక్కి వస్తాయని తెలిపారు. కాగా, పీసీబీ సీఈవో వాసిం ఖాన్ మాట్లాడుతూ.. పూర్తిస్థాయిలో టోర్నీ నిర్వహించలేకపోతే ఆతిథ్య హక్కులను వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

Updated Date - 2020-02-21T00:24:33+05:30 IST