ఏపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన పయ్యావుల

ABN , First Publish Date - 2021-11-05T21:10:31+05:30 IST

ఏపీ ప్రభుత్వాన్ని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సూటిగా ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆగమేఘాలపై ఒప్పందాలు జరుగుతాయా

ఏపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన పయ్యావుల

అమరావతి: ఏపీ ప్రభుత్వాన్ని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సూటిగా ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆగమేఘాలపై ఒప్పందాలు జరుగుతాయా? అని ప్రశ్నించారు. మంచి, చెడ్డలు చూడకుండా ఎలా నిర్ణాయాలు తీసుకుంటారా అని నిలదీశారు. విద్యుత్‌ ఒప్పందాలు గంటల్లోనే జరిగిపోతున్నాయని, 9వేల మెగావాట్లకు గ్రిడ్‌ సెక్యూరిటీ ఉందని ఎలా చెబుతున్నారు?.. ఏపీ డిస్కంలకు చేరేటప్పటికీ ఎంత ధర పడుతుందని ఎలా చెప్పగలరు? అని ప్రశ్నించారు. రూ.2.49కి ఇంకా ఎంత అదనంగా చెల్లిస్తున్నారో చెప్పాలన్నారు. రూ.2.49 పైసలేనని చేబితే తాము నమ్మాలా? అని పయ్యావుల కేశవ్‌ ప్రశ్నించారు. రూ.2.49 కంటే ఎంత ఎక్కువ చెల్లిస్తున్నారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దేశంలో విద్యుత్‌ ధరలు తగ్గే పరిస్థితి వస్తుంటే ఏపీలో భిన్నంగా ఉందన్నారు. టెండర్‌ ప్రక్రియ కాకుండా నామినేషన్‌ పద్ధతితో ఇస్తున్నారని, ధరలు పెరిగే నిర్ణయాలు తీసుకుంటుంటే మౌనంగా ఉండాలా? అని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు.

Updated Date - 2021-11-05T21:10:31+05:30 IST