Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏపీ ఇంధన శాఖ కార్యదర్శికి పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ లేఖ

అమరావతి: ఏపీ ఇంధన శాఖ కార్యదర్శికి పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ లేఖ రాశారు. విద్యుత్ కొనుగోళ్లు, సెకీతో ఒప్పందాలపై ప్రస్తావిస్తూ ఆయన లేఖ రాశారు.  సెకీతో ఒప్పందంపై అభ్యంతరాలకు ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. విద్యుత్ సంస్కరణల ప్రధాన లక్ష్యం దెబ్బతినేలా పబ్లిక్ సర్వెంట్‌గా ఉన్న మీరు ఎలా నిర్ణయాలు తీసుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. గ్రిడ్‌లో 100 శాతం కంటే అదనపు సామర్థ్యాన్ని ఎందుకు  జోడిస్తున్నారని అన్నారు. బిడ్డింగ్ జరపకుండా సెకీ ఆఫర్‌ను ఏకపక్షంగా ఎందుకు అంగీకరించారని పేర్కొన్నారు. రాజకీయ పెద్దల సూచనలకు సివిల్‌ సర్వీసు అధికారి తలొగ్గినట్లు కనిపిస్తుందన్నారు. ప్రతిపాదనలు, సంప్రదింపులు, ఒప్పందాల్లో ఈ స్థాయి వేగం వెనుక కారణాలెందుకు స్పష్టం చేయడం లేదని లేఖలో పేర్కొన్నారు. 

Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

Advertisement