AP News: వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: పయ్యావుల

ABN , First Publish Date - 2022-07-24T22:01:28+05:30 IST

ఈ మూడేళ్ల వైసీపీ పాలనలో చేసిన అప్పులపై శ్వేతపత్రం ప్రకటించాలని పయ్యావుల డిమాండ్ చేశారు.

AP News: వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: పయ్యావుల

అనంతపురం (Anantapuram): రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ తప్పలేదంటూ వైసీపీ ప్రభుత్వ (YCP Govt.) పెద్దలు రోజుకో ప్రెస్ మీట్ పెడుతున్నారని పీఏసీ ఛైర్మన్, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy), నేడు సాక్షి పత్రికలో కథనాలు రాస్తున్నారని, మీరు చెబుతున్నది వాస్తవాలైతే గత ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వం పాలన, ఈ మూడేళ్ల వైసీపీ పాలనలో చేసిన అప్పులపై శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎఫ్ఆర్బిఎం (FRBM) నిబంధనలు గాలికి వదిలేశారని చెబుతున్నవారు... అప్పుడు నిద్ర పోయారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ (Jagan) ఆరోజు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ఈ రోజు ఆర్బీఐ (RBI) చెప్పింది.. ఇంకొకరు చెప్పారంటూ టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగాయంటూ చెప్పడం శుద్ధ అబద్ధమన్నారు. పొరపాట్లు జరిగి ఉంటే బయటపెట్టాలన్నారు. వైసీపీ పాలనపై వైట్ పేపర్ (White Paper) రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

 

ప్రభుత్వం చేస్తున్న అప్పుల్ని సరైన వాటికి వాడటం లేదని.. కావలసిన వారికి దోచి పెట్టడానికి అప్పుల్ని చేస్తున్నారని పయ్యావుల విమర్శించారు. సంక్షేమం కోసం చేస్తున్నది కొంత, పక్క దారి మళ్లుతున్నది ఎక్కువగా ఉందని ఆరోపించారు. చంద్రబాబు (Chandrababu) ప్రభుత్వ హయాంలో అనంతపురం జిల్లాలో  జిల్లేడుబండ ప్రాజెక్టుకు రూ. 90 కోట్ల ఎస్టిమేషన్ వేస్తే.. వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ. 400 కోట్లు అయ్యిందన్నారు. జిల్లేడు బండ ప్రాజెక్టు స్థలం మారలేదు, నీటి సామర్థ్యం పెరగలేదు, కానీ అంచనాలు మాత్రం పెరిగాయన్నారు. దేశంలో జరుగుతున్న పరిస్థితులను చూస్తే అత్యధిక వడ్డీ శాతానికి అప్పులు చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లను పరిశీలిస్తే అన్ని రాష్ట్రాలు చెల్లించేదాని కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువగా చెల్లిస్తోందని పయ్యావుల కేశవ్ అన్నారు.

Updated Date - 2022-07-24T22:01:28+05:30 IST