పేటీఎం షేర్లు పతనం...

ABN , First Publish Date - 2022-01-20T01:07:48+05:30 IST

పేటీఎం షేర్లు దారుణంగా పతనమయ్యాయి. డిజిటల్ పేమెంట్స్ మేజర్ పేటీఎం మాతృ సంస్థ ‘వన్97 కమ్యూనికేషన్స్’ షేర్లు... భారీ వాల్యూమ్‌ల నేపధ్యంలో బుధవారం ఇంట్రా-డేలో 5 శాతం క్షీణించి, రూ. 990 కొత్త కనిష్ట స్థాయిని తాకింది.

పేటీఎం షేర్లు పతనం...

చేతులు మారిన 5.2 మిలియన్ ఈక్విటీ షేర్లు...  

న్యూఢిల్లీ : పేటీఎం షేర్లు దారుణంగా పతనమయ్యాయి. డిజిటల్ పేమెంట్స్ మేజర్ పేటీఎం మాతృ సంస్థ ‘వన్97 కమ్యూనికేషన్స్’ షేర్లు... భారీ వాల్యూమ్‌ల నేపధ్యంలో బుధవారం ఇంట్రా-డేలో 5 శాతం క్షీణించి,  రూ. 990 కొత్త కనిష్ట స్థాయిని తాకింది. బ్రోకరేజ్ సంస్థ మాక్వెయిర్ టార్గెట్ ధర రూ. 900 ను చేరడానికి ఈ స్టాక్... ప్రస్తుతమున్న దానికి 10 శాతానికి పైగా పెరగాల్సి ఉంటుంది. 


గత మూడు వారాల్లో పేటీఎం స్టాక్ ధర 26 శాతం పడిపోయింది. కాగా... ఇష్యూ ధర రూ. 2,150 నుంచి 54 శాతం క్షీణించింది. కంపెనీ తన మార్కెట్‌ను నిరుడు నవంబరు 18 న ప్రారంభించింది. ఈ రోజు మధ్యాహ్నం 12:56 గంటలకు పేటీఎం 4.4 శాతం క్షీణించి, రూ. 997 వద్దకు చేరింది. ఎస్అండ్‌పీ బీఎస్ఈ సెన్సెక్స్‌లో 1.2 శాతం క్షీణించింది. ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో కలిపి 5.2 మిలియన్ల ఈక్విటీ షేర్లు కౌంటర్‌లో చేతులు మారాయి.  లిస్టింగ్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు(ఎఫ్‌పీఐలు) 10.37 శాతం వాటా ఉండగా, వ్యక్తిగత వాటాదారులకు పేటీఎంలో 12.05 శాతం వాటా ఉంది. 

Updated Date - 2022-01-20T01:07:48+05:30 IST