పేటీఎం కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులు

ABN , First Publish Date - 2020-10-20T05:40:24+05:30 IST

దేశంలో అతిపెద్ద మొబైల్‌ వ్యాలెట్‌ సేవల సంస్థ పేటీఎం తాజాగా క్రెడిట్‌ కార్డుల విభాగంలోకి ప్రవేశిస్తోంది. పలు క్రెడిట్‌ కార్డు కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా కో- బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులను ప్రవేశపెట్టనున్నట్లు పేటీఎం ప్రకటించింది. వచ్చే 12-18 నెలల్లో 20 లక్షల...

పేటీఎం కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులు

ఏడాదిన్నరలో 20 లక్షల కస్టమర్ల లక్ష్యం


న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద మొబైల్‌ వ్యాలెట్‌ సేవల సంస్థ పేటీఎం తాజాగా క్రెడిట్‌ కార్డుల విభాగంలోకి ప్రవేశిస్తోంది. పలు క్రెడిట్‌ కార్డు కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా కో- బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులను ప్రవేశపెట్టనున్నట్లు పేటీఎం ప్రకటించింది. వచ్చే 12-18 నెలల్లో 20 లక్షల మందికి ఈ కో-బ్రాండెడ్‌ కార్డులు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.


కార్డు ఫీచర్లు..


వన్‌ టచ్‌ సర్వీస్‌ ద్వారా కార్డు పిన్‌ మార్పు, చిరునామా సవరణ, కార్డు బ్లాక్‌ చేయడం, అవుట్‌స్టాండింగ్‌ క్రెడిట్‌ లిమిట్‌ తెలుసుకోవడంతో పాటు తదితర లావాదేవీల నిర్వహణపై కస్టమర్లకే పూర్తి నియంత్రణ


మోసపూరిత లావాదేవీలకు బీమా కవరేజీ 


ప్రతి లావాదేవీపై అష్యూర్డ్‌ క్యాష్‌బ్యాక్‌తో కూడిన రివార్డ్‌ ప్రోగ్రాం. తద్వారా జమయ్యే రివార్డ్‌ పాయింట్లపై ఎటువంటి కాలపరిమితి ఉండదు. పేటీఎంలోని అన్ని వేదికల్లోనూ వీటిని ఉపయోగించుకునే వెసులుబాటు. 

Updated Date - 2020-10-20T05:40:24+05:30 IST