Paytm CEO: ఇది నిజమేనా?... అని మా అమ్మకు డౌట్

ABN , First Publish Date - 2021-11-18T18:10:41+05:30 IST

పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ ఓ ఆసక్తికర

Paytm CEO: ఇది నిజమేనా?... అని మా అమ్మకు డౌట్

న్యూఢిల్లీ : పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తాను చేస్తున్న వ్యాపారం గురించి తన తల్లిదండ్రులకు తెలియదని, చాలా కాలం నుంచి తాను చేస్తున్నదేమిటో వారికి తెలియదని అన్నారు. ఓసారి ఓ వార్తాపత్రికలో తన సంపద గురించి ప్రచురితమైన వార్తను  తన తల్లి చదివారని, ఆ తర్వాత తన దగ్గరకు వచ్చి, ‘‘విజయ్, వాళ్ళు చెప్తున్నంత డబ్బు నీ దగ్గర ఉందా?’’ అని అడిగారని తెలిపారు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం ఆయన ప్రస్తుత సంపద విలువ రూ.2.4 బిలియన్ డాలర్లు.


పేటీఎం పేరెంట్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్ గురువారం ఉదయం దలాల్ స్ట్రీట్‌లో ప్రవేశించడంతో పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ అత్యంత భావోద్వేగానికి లోనయ్యారు. బీఎస్ఈ వద్ద ఆనంద బాష్పాలతో మాట్లాడుతూ, జాతీయ గీతంలోని భారత భాగ్య విధాత అనే పదాలు తనను భావోద్వేగానికి గురి చేసినట్లు తెలిపారు 


పేటీఎం షేర్లు గురువారం ఉదయం బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో లిస్ట్ అయ్యాయి. రూ.18,300 కోట్లతో పేటీఎం లిస్టింగ్ దేశంలో ఇప్పటి వరకు అత్యధిక విలువ కలదిగా రికార్డు సృష్టించింది. 


Updated Date - 2021-11-18T18:10:41+05:30 IST