పోస్టర్లను ఆవిష్కరిస్తున్న వీఆర్‌ఏలు, నాయకులు
-సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ముంజం ఆనంద్
కాగజ్‌నగర్ టౌన్, మే 20: సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు వీఆర్‌ఏలకు పేస్కేల్ వర్తింపజేయాలని సీసీఎల్‌ఏ (ప్రఽధాన భూపరిపాలనశాఖ) కార్యాలయం ఎదుట నేడు నిరసన చేపట్టేందుకు చలో సీసీఎల్‌ఏ హైదరాబాద్ నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్లను శుక్రవారం కాగజ్‌నగర్ తహసీల్దార్ కార్యాల యం ఆవరణలో వీఆర్‌ఏలతో కలిసి సీఐటీయూ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐ టీయూ జిల్లాఉపాధ్యక్షుడు ముంజం ఆనంద్ మాట్లాడుతూ విద్యార్హతకలిగిన వారికి ప్రమోషన్ ఇవ్వాలని, వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీఎం వీఆర్‌ఎల సమస్య పరిష్కరిస్తామని ప్రకటించి 20 నెలలు దాటిందన్నారు. సమస్యల పరిష్కారం కోసం మే21న చలో సీసీఎల్‌ఏ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజయ్య, శ్యాంరావు, విజయ్, సునీత, శ్రీదేవి, లక్ష్మణ్, అనిల్, చందు పాల్గొన్నారు.