10 లోపు కాంట్రాక్టు బిల్లుల చెల్లింపు

ABN , First Publish Date - 2022-06-30T06:21:30+05:30 IST

జిల్లాలోని వివిధ అభి వృద్ధి పనులకు చెల్లించాల్సిన కాంట్రాక్టు బిల్లులను వచ్చే నెల 10వ తేదీలోపు చెల్లింపులు జరుగుతాయని, అందువ ల్ల ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని మాజీమంత్రి, ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాల వైసీపీ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

10 లోపు కాంట్రాక్టు బిల్లుల చెల్లింపు
సదస్సులో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి

పార్టీ కార్యక్తలను ఇబ్బందులు పెడితే సహించేది లేదు..

వారిని విస్మరిస్తే ఎమ్మెల్యే టిక్కెట్లు కూడా దక్కవ్‌

జిల్లా వైసీపీ ప్లీనరీలో మాజీమంత్రి బాలినేని 

టీడీపీ నేతల దుష్ప్రచారంపై ధ్వజం


ఒంగోలు(కలెక్టరేట్‌), జూన్‌ 29 : జిల్లాలోని వివిధ అభి వృద్ధి పనులకు చెల్లించాల్సిన కాంట్రాక్టు బిల్లులను వచ్చే నెల 10వ తేదీలోపు చెల్లింపులు జరుగుతాయని, అందువ ల్ల ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని మాజీమంత్రి, ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాల వైసీపీ  సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అం దుకు అవసరమైన కసరత్తు ఇప్పటికే ప్రారంభమైందని తెలిపారు. ఒంగోలు సమీపంలోని లింగారెడ్డి కన్వెన్షన్‌ హా లులో బుధవారం వైసీపీ జిల్లా ప్లీనరీ సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్‌.సుధాకర్‌బాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన బాలినేని మాట్లాడు తూ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా మనందరం పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రా మాల్లో సచివాలయాలు, ఆర్‌బీకేలు, హెల్త్‌ క్లినిక్‌ భవనా లను త్వరగా పూర్తి చేసేందుకు ఎమ్మెల్యేలు చొరవ తీసు కోవాలని చెప్పారు. పనులు చేస్తే డబ్బులు రావానే అపో హలు ఉన్నాయని, వాటిని తొలగించి చేసిన పనులకు స కాలంలో చెల్లింపులు చేస్తామని వెల్లడించారు. ఈ విష యంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మీకు.. నాకు ఎ మ్మెల్యే టిక్కెట్లు వచ్చే పరిస్థితి కూడా ఉండదన్నారు. కార్యకర్తలు లేక పోతే పార్టీకి మనుగడ లేదని, ఇప్పటికైనా  అందరం  ఆత్మపరిశీలన చేసుకొని ఈ రెండేళ్లు అయినా వారికి అండగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందన్నా రు. తనకు సంబంధం లేని విషయంలో టీడీపీ దుష్ప్రచా రం చేస్తోందని, ఎంత మంది ఎన్ని కుట్రలు పన్నినా వా టన్నింటినీ ఎదుర్కొంటానని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో నే మంత్రి పదవిని వదులుకున్న వ్యక్తిని తాను అని చె ప్పారు. దివంగత సీఎం వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హయాంలో జిల్లా అభివృద్ధికి శాశ్విత పనులు చేపట్టామని, టీడీపీ పా లనలో ఒక్కటైనా చేశారా అని బాలినేని ప్రశ్నించారు. పా ర్లమెంట్‌ నియోజకవర్గాల ప్రాతిపదికన నూతన జిల్లాల ఏర్పాటు జరిగిందన్నారు. కొత్తగా ఇంకా జిల్లాలు పెంచితే అందులో మార్కాపురం జిల్లా ఉంటుందని తెలిపారు.  


కార్యకర్తలే వెన్నుముక : మంత్రి సురేష్‌


రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే వెన్నుముకని, వారికి ఆ ర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రానున్న రెం డేళ్లలో పలు కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు. సీఎం జగన్‌ అనుసరిస్తున్న సామాజిక న్యాయం వల్లే తా ను ఈ రోజు మంత్రి స్థానంలో ఉన్నట్లు చెప్పారు. 


శ్రేణుల్లో అసంతృప్తి : ఎంపీ మాగుంట


పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి అ నేది ఉందని ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నా రు. అయితే అది తాత్కాలికమేనన్నారు. మాగుంట కుటు ంబం సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగుతుందని తెలి పారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ స్థానా లతో పాటు ఒంగోలు పార్లమెంట్‌ స్థానాన్ని కైవసం చేసు కోవాల్సిన అవసరం ఉందన్నారు. 


ఆర్థికంగా నష్టపోయారు : మద్దిశెట్టి


దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ మాట్లాడుతూ తాను  ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తలో పార్టీ నాయకులు, కా ర్యకర్తలకు పెద్ద ఎత్తున కాంట్రాక్టు పనులు ఇచ్చానని, అ లా దర్శి నియోజకవర్గంలో రూ.100 కోట్ల పనులకు బిల్లు లు రాకపోవడంతో కార్యకర్తలు ఆర్థికంగా నష్టపోయారని తెలిపారు. గడపగడప కార్యక్రమంలోఒక కార్యకర్త ఇదే విషయాన్ని చెప్పి ఆవేదన చెందాడన్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులనుసకాలంలో మంజూరు చేసే విధంగా చ ర్యలు తీసుకోవాలని కోరారు. 


తీర్మానాలు ఆమోదం


కాగా సమావేశం అనంతరం మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రవేశపెట్టిన పలు తీర్మానాలను ఆమోదిం చారు. ఈ ఏడాది పూర్తి కానున్న వెలిగొండ ప్రాజెక్టుకు ఆర్‌అండ్‌ ప్యాకేజి, ఇతర చెల్లింపుల కోసం రూ.1400 కోట్లు విడుదల చేయాలని, వైపాలెం నియోజకవర్గంలోని కండలేరు ఛానల్‌కు అనుసంధానంగా కాలువ నిర్మాణా నికి రూ.83 కోట్లు, ఒంగోలులో ఆంధ్రకేసరియూనివర్శిటీకి రూ.100 కోట్లు, గిద్దలూరు నియోజకవర్గంలోని అర్థవీడు మండలంలో వెలిగొండ ప్రాజెక్టు నుంచి మంచినీరు అంది ంచేందుకు ప్రాజెక్టును, ఒంగోలులో రోజూ మంచినీటిని ఇ చ్చేందుకు సీఎం హామీ ఇచ్చిన రూ.350 కోట్లు వెంటనే విడుదల చేయాలని తీర్మానం చేశారు. అంతకు ముందు పార్టీ జెండాను ఆవిష్కరించిన అనం తరం దివంగత సీఎం వైఎస్‌.రాజశేఖరర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జ డ్పీచైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, పోతుల సునీత, ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, కె.నాగార్జు నరెడ్డి, బుర్రా మదుసూదన్‌ యాదవ్‌, మాజీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జంకె వెంకటరెడ్డి, కొండపి ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు, పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌ మాదాశి వెంకయ్య, మేయర్‌ గంగాడ సుజాత, పలు కా ర్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, మునిసిపల్‌ చైర్మన్లు తదిత రులు పాల్గొన్నారు.


పోతుల సునీతకు సత్కారం


వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా నియమితులైన ఎమ్మెల్సీ పోతుల సునీతను సత్కరించారు. జిల్లాకు చెంది న పోతుల సునీతను రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ని యమించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి ఆమెను సన్మానించారు. 


Updated Date - 2022-06-30T06:21:30+05:30 IST