అతిథులకు డబ్బులిచ్చిమరీ పెళ్లి పిలుపులు.. కారణం తెలిస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు!

ABN , First Publish Date - 2021-10-24T16:16:24+05:30 IST

మన దేశంలో పెళ్లి ఎంతో ఉత్సాహంగా జరిగే ఒక పండుగలాంటిది.

అతిథులకు డబ్బులిచ్చిమరీ పెళ్లి పిలుపులు.. కారణం తెలిస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు!

మన దేశంలో పెళ్లి ఎంతో ఉత్సాహంగా జరిగే ఒక పండుగలాంటిది. ఈ శుభకార్యానికి తెలిసిన బంధువులను, స్నేహితులను, శ్రేయోభిలాషులను.. ఇలా ప్రతీ ఒక్కరినీ పిలుస్తుంటారు. అయితే ఆ దేశంలో జరిగే వివాహ వేడుకలకు అతిథులను డబ్బులిచ్చి ఆహ్వానిస్తారు. తమ ఇంట్లో జరిగే పెళ్లివేడుకకు ఎంతమంది అతిథులువస్తే సోషల్ సర్కిల్ అంత భారీగా కనిపిస్తుందని వారు తపనపడుతుంటారు. అలాగే అతిథుల ముందు తమ స్టేటస్ చూపించుకోవచ్చని కూడా వారు భావిస్తుంటారు. ఇందుకోసం ఎంత డబ్బు అయినా ఖర్చు చేసేందుకు వెనుకాడరు. పైగా ఈ దేశంలో అతిథులను పెళ్లిళ్లకు పంపేందుకు కొన్ని ఏజెన్సీలు పనిచేస్తున్నాయి.


దక్షిణాఫ్రికాలో ఇటువంటి పెళ్లిళ్ల తంతు జరుగుతుంటుంది. అక్కడ వెడ్డింగ్ గెస్ట్ బిజినెస్ బ్రహ్మాండంగా సాగుతోంది. ఈ వ్యాపారాన్ని చేపట్టేందుకు అక్కడి యువత పోటీ పడుతుంటుంది. ఈ ఏజెన్సీలు కొంతమొత్తంలో డబ్బు వసూలు చేసి, అతిథులను పెళ్లిళ్లకు పంపిస్తుంటాయి. అయితే వీరు పెళ్లిళ్లకు హాజరయ్యే అతిథులకు ముందుగా ట్రైనింగ్ ఇస్తారు. వారు పెళ్లిలో ఎలా మెలగాలనేది తెలియజేస్తారు. ఇక్కడి Hagaek Friends లాంటి ఏజెన్సీలు ఫేక్ గెస్ట్‌లను పెళ్లిళ్లకు పంపిస్తుంటాయి. ఈ ఏజెన్సీలు కరోనా కాలంలో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, ఇప్పుడిప్పుడే కోలుకుని, తిరిగి తమ వ్యాపారాన్ని పూర్తిస్థాయిలో నిర్వహిస్తున్నాయి. కరోనా ఆంక్షలు తొలగించిన తరువాత తాము 250 మంది ఫేక్ గెస్ట్‌లను పెళ్లిళ్లకు పంపించే అవకాశం కలిగిందని కొన్ని ఏజెన్సీలు చెబుతున్నాయి. ఒక్కో ఫేక్ గెస్ట్‌ను పంపేందుకు 20 డాలర్లు.. అంటే భారత కరెన్సీలో 1,500 వరకూ పెళ్లివారి నుంచి వసూలు చేస్తామని ఏజెన్సీలు తెలిపాయి.

Updated Date - 2021-10-24T16:16:24+05:30 IST