Abn logo
Jul 4 2020 @ 08:06AM

‘ఇండియ‌న్‌2’లో హాట్ బ్యూటీ..?

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘ఇండియ‌న్‌2’. గ‌తంలో వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన ‘ఇండియ‌న్’ సినిమాకు ఇది సీక్వెల్‌. కొంత మేర‌కు చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. క‌రోనా ప్ర‌భావం కార‌ణంగా సినిమా షూటింగ్ ఆగింది. ప్ర‌భుత్వం షూటింగ్స్‌కు అనుమ‌తులు ఇచ్చిన నేప‌థ్యంలో.. ప్ర‌భుత్వం చెప్పిన విధి విధానాల్లో శంక‌ర్ సినిమాను టేకాఫ్ చేస్తారా?  లేదా?  అనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. తాజా స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో తొలి చిత్రం ‘ఆర్.ఎక్స్ 100’తో యూత్‌లో మంచి క్రేజ్ ద‌క్కించుకున్న హాట్ బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్ ఇందులో స్పెష‌ల్ సాంగ్ చేయ‌నుంది. ఇప్ప‌టికే ఈ చిత్రంలో ఇద్ద‌రు స్టార్ హీరోయిన్స్‌ కాజ‌ల్ అగ‌ర్వాల్, ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు శంక‌ర్ మ‌రింత గ్లామ‌ర్ యాడ్ చేయ‌బోతున్నార‌ని టాక్‌. ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది. 

Advertisement
Advertisement
Advertisement