AP News: గృహ నిర్మాణంలో వెనకబడ్డ జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టండి: వైఎస్ జగన్

ABN , First Publish Date - 2022-09-22T22:54:28+05:30 IST

Amaravathi: పేదలందరికి గ‌ృహ నిర్మాణాలపై గృహనిర్మాణ, రెవెన్యూ, పురపాలక - పట్టణాభివృద్ధి, గిరిజన సంక్షేమశాఖలతో సీఎం జగన్‌ (CM Jagan) క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం (Review Meeting) నిర్వహించారు. గత సమావేశాల్లో ఇచ్చిన ఆదేశాల అమలు తీరును సీఎంకు అధికారులు వివరించారు. 2022–23 ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ. 4,318 కోట్ల విలువైన పనులు చేశామని చెప్పారు. తొ

AP News: గృహ నిర్మాణంలో వెనకబడ్డ జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టండి: వైఎస్ జగన్

Amaravathi: పేదలందరికి గ‌ృహ నిర్మాణాలపై గృహనిర్మాణ, రెవెన్యూ, పురపాలక - పట్టణాభివృద్ధి, గిరిజన సంక్షేమశాఖలతో సీఎం జగన్‌ (CM Jagan) క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం (Review Meeting) నిర్వహించారు. గత సమావేశాల్లో ఇచ్చిన ఆదేశాల అమలు తీరును సీఎంకు అధికారులు వివరించారు. 2022–23 ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ. 4,318 కోట్ల విలువైన పనులు చేశామని చెప్పారు. తొలివిడతలో 15.6 లక్షలు, రెండో విడతలో 5.65 లక్షలు మొత్తంగా 21.25 లక్షల ఇళ్లను మంజూరు చేశామని వివరించారు. వర్షాలు తగ్గగానే ప్రతి‌వారం కూడా ఇళ్ల నిర్మాణం జరుగుతుందని చెప్పారు. ఆప్షన్‌ –3 ( ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలన్న) ఎంపిక చేసుకున్న ఇళ్ల పనులపై ప్రతివారం నిర్మాణ సంస్థలతో సమీక్ష చేస్తున్నామన్న అధికారులు సీఎంకు చెప్పారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘హౌసింగ్‌కు అత్యంత ప్రాధాన్య ఇస్తున్నాం. నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలి. గృహ నిర్మాణంలో వెనకబడ్డ జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే సరికి జగనన్న కాలనీల్లో డ్రైనేజీ, కరెంటు, తాగునీరు లాంటి కనీస వసతులు కల్పించాలి.’’ అని ఆదేశించారు. ముఖ్యమంత్రి టిడ్కో (TIDCO) ఇళ్లపై కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే పనులు పూర్తయిన వాటిని లబ్ధిదారులకు అందిస్తున్నామని అధికారులు సీఎంకు చెప్పారు. డిసెంబరు నాటికి అన్నింటిని  లబ్ధిదారులకు అందిస్తామన్న చెప్పారు.

  

Updated Date - 2022-09-22T22:54:28+05:30 IST