5 శాతం రిబేట్‌తో ఆస్తిపన్ను చెల్లించాలి

ABN , First Publish Date - 2021-04-16T06:16:54+05:30 IST

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు ప్రభుత్వం ప్రకటించిన 5 శాతం రిబేట్‌ను వినియోగించుకుని ఆస్తిపన్ను చెల్లించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నిట్టుజాహ్నవి తెలిపారు.

5 శాతం రిబేట్‌తో ఆస్తిపన్ను చెల్లించాలి

కామారెడ్డిటౌన్‌, ఏప్రిల్‌ 15: కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు ప్రభుత్వం ప్రకటించిన 5 శాతం రిబేట్‌ను వినియోగించుకుని ఆస్తిపన్ను చెల్లించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నిట్టుజాహ్నవి తెలిపారు. గురువారం కామారెడ్డి మున్సిపాలిటీలో జీవదాన్‌ ఆసుపత్రికి చెందిన రూ.5లక్షల 39వేల748 ఆస్తిపన్నును 5 శాతం రిబేట్‌తో చెల్లించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన రిబేట్‌ ద్వారా ఇప్ప టివరకు రూ.22లక్షల ఆస్తిపన్ను వసూలైందని తెలిపారు. ప్రస్తుతం వాణిజ్య సంస్థల   యాజమాన్యాలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని, గృహసముదాయల వారు సైతం ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆస్తిపన్ను చెల్లించి వడ్డీ రాయితీ పొందాలని తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఐ జానయ్య, బిల్‌కలెక్టర్‌లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-16T06:16:54+05:30 IST