నెల్లూరు (విద్య) ఫిబ్రవరి 6:డీఈవో జనార్దనాచార్యులు
ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఈవో జనార్దనాచార్యులు తెలిపారు. నగరంలోని ఇన్‌ఫాంట్ జీసెస్ ప్రాంగణంలో జిల్లాలోని సహితవిద్య రీసోర్స్ టీచర్లకు రెండోవిడత శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సహితవిద్యలో ఉపాధ్యాయులు విద్యార్థులపై అవగాహన పెంచుకోవడంతో వారి అవసరాలకు తగిన విధంగా బోధన అందించాలన్నారు. ఇందులో భాగంగా శిక్షణ తరగతులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త వీ.పూర్ణచంద్రరావు, సహాయక సమన్వయకర్త వీ.సుధాకర్, ఏఎంవో ఖాజామెహిద్దీన్, సిబ్బంది పాల్గొన్నారు.