ఆందోళన చేస్తున్న గ్రామస్థులు
మొయినాబాద్ రూరల్, జూన్ 28: విద్యుత్ సమస్యలు పరిష్కరించే వరకూ కరెంటు బిల్లులు చెల్లించేది లేదని హిమయత్‌నగర్ గ్రామ రైతులు మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. వారం రోజుల నుంచి గ్రామంలో విద్యుత్ సరఫరాలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. సమస్యలు తీర్చేదాకా ఊరుకోమని భీష్మించారు. సర్పంచ్ మంజుల రవియాదవ్ గ్రామస్ధులకు నచ్చజెప్పడంతో గ్రామస్థులు శాంతించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో విద్యుత్ అధికారుల సమీక్షలో వారి సమస్యలను వివరించారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.