Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 25 Jun 2022 08:13:37 IST

Pawankalyan రీమేక్ మూవీ లాంచ్ అయిందా?

twitter-iconwatsapp-iconfb-icon

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawankalyan) ఈ ఏడాది ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) చిత్రంతో బ్లాక్‌బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). క్రిష్ (Krish) దర్శకత్వంలో ఏ.యం.రత్నం (AM Ratnam) నిర్మాణంలో ఈ సినిమా ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. పవన్ కెరీర్ లో మొట్టమొదటి జానపద చిత్రమే కాకుండా.. తొలి పాన్ ఇండియా సినిమా కూడా. భారీ బడ్జెట్‌తో మొత్తం ఐదు భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. కీరవాణి (Keeravani) సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్ (Nidhi Agarwal), నర్గీస్ ఫక్రీ (Nargis Fakri) కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరిదశలో ఉంది. ఈ ఆగస్ట్ నెలతో మొత్తం షూట్ కంప్లీట్ చేయాలన్నది క్రిష్ ప్లాన్. ఇక ఆయన తదుపరి చిత్రానికి సంబంధించిన ఒక అప్డేట్ అభిమానుల్ని ఖుషీ చేస్తోంది. 

నిజానికి పవన్ కళ్యాణ్ .. ‘హరిహర వీరమల్లు’ చిత్రం తర్వాత హరీశ్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ (Bhavadeeyudu Bhagathsingh) చిత్రం షూటింగ్ మొదలు పెట్టాలి. అయితే దీని కన్నా ముందు.. ఓ తమిళ రీమేక్ చేయబోతున్నారు. సముద్రఖని (Samudra Khani) దర్శకత్వంలో తానే ప్రధాన పాత్ర పోషిస్తూ.. తంబిరామయ్య (Thambi Ramayya) కీలక పాత్రలో తెరకెక్కించిన చిత్రం ‘వినోదయ చిత్తం’. ఈ  మూవీ రీమేక్‌ను సముద్రఖని దర్శకత్వంలోనే తెలుగులో పవన్, సాయిధరమ్ తేజ్ కలయికలో రూపొందించబోతున్నారని ఇదివరకే వార్తలొచ్చాయి. ఈ సినిమా కోసం పవన్ 20 రోజులు టైమ్ కేటాయించినట్టు సమాచారం. పవన్ నటించే సన్నివేశాలకోసం ప్రత్యేకించి ఒక షెడ్యూల్ ను కేటాయించబోతున్నారు. దీంతో పవన్ పాత్రకు సంబంధించిన షూట్ కంప్లీట్ అవుతుంది. ఇదే షెడ్యూల్‌లో సాయిధరమ్ తేజ్‌తో కాంబినేషన్ సీన్స్ కూడా ఉంటాయి. 

అసలు విషయానికొస్తే ఈ సినిమా ఆల్రెడీ లాంచ్ అయిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదెవరూ ఊహించిన విషయం. పవన్ కళ్యాణ్ సినిమాలెప్పుడూ ఇంత సైలెంట్‌గా చడీచప్పుడు కాకుండా మొదలైంది లేదు. ఈ ఏడాది తో ‘హరిహర వీరమల్లు, ఈ రీమేక్ సినిమా షూటింగ్స్ కంప్లీట్ చేయాలన్నదే పవన్ ప్లాన్ గా తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి మళ్ళీ రాజకీయ పరంగా ఆయన బిజీ కాబోతున్నారు. ఆ తర్వాత హరీశ్ శంకర్ సినిమా ఉంటుందని టాక్. వచ్చేనెల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్న ఈ తమిళ రీమేక్ మూవీ ఎప్పుడు విడుదలవుతుందో చూడాలి. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement