Abn logo
Sep 23 2021 @ 21:25PM

వైసీపీది దౌర్భాగ్యపు పాలన: పవన్

అమరావతి: వైసీపీది దౌర్భాగ్యపు పాలన అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఈ దాష్టీకాలను ధీటుగా ఎదుర్కొంటామన్నారు. ఎస్సీలపైనే ఎస్సీ అట్రాసిటీ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పోరాటాలకు జనసేన సిద్ధమని తెలిపారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు సృష్టించినా పరిషత్ ఎన్నికల్లో బలంగా పోరాడాం... 25.2% ఓట్లు సాధించామన్నారు. నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకూ వైసీపీ అరాచకాలు చేస్తుంటే అధికార యంత్రాంగం చోద్యం చూసిందన్నారు. జనసేన విజయ ప్రస్థానం బిందువుగా మొదలై సింధువుగా మారుతోందన్నారు. పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన అభ్యర్ధులకు మరోసారి అభినందనలు తెలిపారు. దాడులు, బెదిరింపులతో వైసీపీ నేతలు  పాలన చేస్తున్నారని మండిపడ్డారు. 


 

క్రైమ్ మరిన్ని...