అమరావతి: రూ. లక్ష కట్టించుకుని టిడ్కో ఇళ్లు ఇవ్వలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ముద్దుల మామయ్య విదేశాల్లో తిరుగుతున్నాడని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కట్టడం లేదన్నారు. విదేశీ విద్యకు కూడా జగన్ సర్కార్ డబ్బులివ్వడం లేదని ఆరోపించారు. రోజా తనను తిట్టడం కాదు.. ప్రజలు సమస్యలు చూడాలని సూచించారు. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. పిడుగురాళ్లలో భూసేకరణ చేసి ఏళ్లు గడిచినా పరిశ్రమ రాలేదన్నారు. పరిశ్రమపై ఎవరైనా అడిగితే ప్రభుత్వం వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.