పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తున్న సినిమా. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఏఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మొఘల్ కాలం నాటి కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ గజదొంగగా కనిపిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో భారీ ఛార్మినార్ సెట్, గండికోట సంస్థానం సెట్ నిర్మించారు.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన హై యాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతోందట. మల్ల యోధులతో పవన్ తలపడుతున్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఛార్మినార్ సెట్ వద్ద అత్యంత భారీగా ఈ సన్నివేశాల చిత్రీకరణ జరగుతోందట. భారీ దేహాలు ఉన్న మల్లయోధులతో పవన్ ఉన్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు `హరి హర వీరమల్లు` అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.