Abn logo
Jul 12 2020 @ 15:21PM

అమితాబ్‌కు కరోనా.. పవన్ ట్వీట్

బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌కు కోవిడ్-19 పాజిటివ్ రావడంపై జనసేన అధినేత, తెలుగు సినీ నటుడు పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమితాబ్‌ బచ్చన్ తొందరలో కోలుకోవాలని, ఆయనను మళ్లీ ఆరోగ్య వంతుడిగా చూడాలని ధన్వంతరీ మాతను వేడుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.


‘‘నా ప్రియమైన, గౌరవనీయలైన అమితాబ్ బచ్చన్‌కి,

నా తల్లి, తండ్రితో సహా కుటుంబం మొత్తం మీ శ్రేయస్సు కోసం ప్రార్థించిన నాటి సమయం నేను ఇప్పటికీ గుర్తుంచుకున్నాను. మీరు 'కూలీ షూట్'లో గాయపడినప్పుడు అందరూ మీ క్షేమాన్ని కాంక్షించారు. మేము మిమ్మల్ని సదా ప్రేమిస్తూనే ఉంటాము. ఒక్క మీ ప్రతిభనే కాకుండా మీ పోరాట స్ఫూర్తి, సరళత, వినయాన్ని సైతం మేము ఇష్టపడతాం. మీరు, అభిషేక్ కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసి చాలా బాధ కలిగింది. ధన్వంత్రి మాత మిమ్మల్ని అభిషేక్‌ని శక్తిమంతుల్ని చేయాలని, మీరిద్దరినీ మంచి ఆరోగ్యంతో చూడాలని ఎదురుచూస్తున్నాం’’ అని పవన్ ట్వీట్ చేశారు. చివరలో మీ అభిమాని, ఆరాధకుడు అని రాసుకొచ్చారు.

Advertisement
Advertisement
Advertisement