పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ క్రిష్ కలయికలో ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతేడాదే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. లాక్డౌన్ కారణంగా ఆగిపోయింది. ఇటీవల `వకీల్ సాబ్` పూర్తి చేసిన తర్వాత మళ్లీ ఈ సినిమా షూటింగ్‌ను పవన్ ప్రారంభించారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.
ఈ షెడ్యూల్లో రెండు పాటలను చిత్రీకరించనున్నారట. ఆ తర్వాత మళ్లీ ఈ సినిమాకు బ్రేక్ ఇస్తారట. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో `అయ్యప్పనుమ్ కోషియమ్` రీమేక్ షూటింగ్‌ను మొదలుపెడతారట. 20 రోజులపాటు ఆ సినిమా షూటింగ్లో పాల్గొన్న తర్వాత మళ్లీ క్రిష్ సినిమా సెట్స్‌కు వస్తారట. ఈ రెండు సినిమాల షూటింగ్‌లకూ సమాంతరంగా హాజరు కావాలని పవన్ అనుకుంటున్నారట.