Oct 26 2021 @ 12:24PM

'హరిహర వీరమల్లు' మూవీలో పవన్ తనయుడు..?

మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి 'ఆచార్య' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరినీ సిల్వర్ స్క్రీన్‌పై చూసేందుకు మెగా అభిమానులే కాదు సినీ లవర్స్ అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇదే క్రమంలో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన తనయుడు అకీరా నందన్ కలిసి స్క్రీన్ మీద కనువిందు చేయబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వచ్చి వైరల్ అవుతున్నాయి. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడికల్ మూవీ 'హరి హర వీరమల్లు'. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 

దాదాపు 60 శాతం చిత్రీకరణ పూర్తైన ఈ సినిమా కొత్త షెడ్యూల్ త్వరలో ప్రారంభమవబోతోంది. అయితే, ఈ మూవీలోని ఓ కీలక పాత్ర కోసం పవర్ స్టార్ తనయుడు అకీరా నందన్‌ను తీసుకుంటున్నట్టుగా సమాచారం. తండ్రి పవన్‌తో పాటు అకీరా కలిసి సీన్స్‌లో సందడి చేయనున్నారట. ఇది ఇంకా అఫీషియల్ కానప్పటికీ ఈ వార్త మెగా అభిమానుల్లో మాత్రం టన్నులకొద్ది ఉత్సాహాన్ని నింపుతోంది. చూడాలి మరి దీనికి సంబంధిచిన అఫీషియల్ న్యూస్ ఎప్పుడు వస్తుందో. కాగా ఈ మూవీలో నిధీ అగర్వాల్, జాక్విలిన్ ఫెర్నాండస్ హీరోయిన్స్. ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడు.