పవన్ కళ్యాణ్ షాకింగ్ డెసిషన్.. మళ్ళీ సినిమాలకు బ్రేక్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏప్రిల్ లో విడుదలైన ‘వకీల్ సాబ్’ తో టాలీవుడ్ లోకి కమ్ బ్యాక్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సూపర్ సక్సెస్ తో, ఆయనిచ్చిన మూడేళ్ళ గ్యాప్ ను అభిమానులు మరిచిపోయేలా చేశారు. ప్రస్తుతం పవర్ స్టార్ డైరీ వరుస సినిమాలతో నిండిపోయింది. ‘ భీమ్లానాయక్, హరిహర వీరమల్లు’ చిత్రాలు ప్రస్తుతం సెట్స్ మీదుండగా.. త్వరలో హరీశ్ శంకర్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఆపై సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో మూవీ కూడా సెట్స్ మీదకు వెళుతుంది. ఇంకా పలువురు స్టార్ డైరెక్టర్స్ పవన్ తో కమిట్ మెంట్ తీసుకున్నారు. అలాగే.. మరికొందరు దర్శకులు ఆయనతో సినిమాలు తీయడానికి క్యూలో ఉన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. పవర్ స్టార్ ఈ నాలుగు సినిమాలు పూర్తి చేశాకా సినిమాలకు మళ్ళీ బ్రేక్ ఇవ్వనున్నారన్న వార్త బలంగా వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే.. ఇది అభిమానులకు నిజంగా చేదువార్తే. ‘కాటమరాయుడు’ తర్వాత పవన్ ఇచ్చిన గ్యాప్ కే అభిమానులు ఆందోళన చెందారు. ఇప్పుడు ఆయన ఇంకెన్నాళ్ళు బ్రేకిస్తారోనని అభిమానులు తల్లడిల్లుతున్నారని సినీ వర్గాల్లో చర్చజరుగుతోంది.



ఇటీవల పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో ఇదివరకటికన్నా చాలా చురుగ్గా ఉన్నారు. వైయస్ జగన్ ప్రభుత్వంపై మాటల తూటాలు పేల్చుతున్నారు. వారి తీరుని చీల్చి చెండాడుతున్నారు. నిజానికి జనసేన పార్టీని ఆర్ధికంగా బలోపేతం చేయడానికే ఆయనిప్పుడు సినిమాల మీద సినిమాలు చేస్తున్నారన్న మాట వినిపిస్తోంది. అయితే 2024 ఎన్నికల నాటికి తాను పూర్తిగా రాజకీయాలకే పరిమితమవ్వాలన్నది ఆయన ప్లాన్ గా తెలుస్తోంది. ఇప్పుడు చేస్తున్న నాలుగు సినిమాలకు తోడు మరిన్ని సినిమాలకి కమిట్ అయితే.. తన రాజకీయ ప్రయాణానికి ఆటంకం కలుగుతుందని ఆయన భావిస్తున్నారట. అందుకే మళ్లీ కొంతకాలం సినిమాలకు బ్రేకివ్వబోతున్నారట. ఈ నేపథ్యంలో ఆయన ఇకపై ఏ సినిమాకీ కూడా సంతకం చేయడం లేదని తెలుస్తోంది. మరి ఈసారి వచ్చే ఎన్నికల్లో అయినా.. జగన్ ప్రభుత్వానికి పవన్ గట్టి పోటీఇస్తారేమో చూడాలి. 

Advertisement
Advertisement