Pawan kalyan: సెట్‌కి వెళ్లకముందే బిజినెస్‌ క్లోజ్‌!

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ అటు రాజకీయాలతోపాటు ఇటు సినిమాలతోనూ బిజీగా ఉన్నారు. వరుసగా ఆయన చేతిలో నాలుగు చిత్రాలున్నాయి. ‘భీమ్లా నాయక్‌’, ‘హరిహర వీరమల్లు’ సెట్స్‌ మీదున్నాయి. ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ త్వరలో సెట్స్‌ మీదకు వెళ్లనుంది. విడుదలకు సిద్ధమవుతున్న ‘భీమ్లానాయక్‌’. ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి ఇంకా శాటిలైట్‌ హక్కులు ఇంకా ఎవరూ తీసుకోలేదు. ఇంకా ప్రారంభం కాని పవన్‌ కల్యాణ్‌, సురేందర్‌ రెడ్డి కాంబినేషన్‌ సినిమా బిజినెస్‌ పూర్తయిందని టాక్‌. 

ఈ సినిమాకు సంబంధించి శాటిలైట్‌, డిజిటల్‌ రైట్స్‌తోపాటు కొన్ని నాన్‌–థియేట్రికల్‌ రైట్స్‌ను జీ గ్రూప్‌ దక్కించుకుందని తెలిసింది. అంతే కాదు ఈ ప్రాజెక్ట్‌కు జీ సహ–నిర్మాతగా కూడా వ్యవహరించబోతోందని సమాచారం. ఎస్‌ఆర్జీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామ్‌ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వక్కంతం వంశీ కథ అందించారు. హైదరాబాద్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో పక్కా యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌గా ఈ సినిమా రాబోతుంది. ఇటీవల కాలంలో భారీ చిత్రాల నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తోంది జీ సంస్థ. అక్టోబర్‌లో విడుదలైన ‘రిపబ్లిక్‌’ సినిమాలోనూ భాగమైంది. ఇప్పుడు ‘బంగార్రాజు’ సినిమాకు సహ–నిర్మాతగా వ్యవహరిస్తోంది. 



Advertisement