పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్.. ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. సినిమాల విషయానికి వస్తే, పవన్‌కళ్యాణ్ స్పీడు చూసి ఇతర స్టార్ హీరోలు సైతం జంకుతున్నారు. పవన్ ఇప్పటికే 'వకీల్‌సాబ్' సినిమాను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండు సినిమాల షూటింగ్స్‌ను పూర్తి చేసే పనిలో తలమునకలై ఉన్నాడు. ఈ రెండు సినిమాల్లో పీరియాడిక్ మూవీ 'హరి హర వీరమల్లు' ఒకటి. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఎ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమా కోసం వేసిన గండిపేట ప్రాంతం, ఛార్మినార్ సెట్లో పవన్ కళ్యాణ్, వస్తాదుల మధ్య యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. పవన్‌కళ్యాణ్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాలో ఈ యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేశాడట. ఇప్పటి వరకు పవన్ తన సినిమాల్లో చేయని మేనరిజమ్స్‌ను 'హరిహర వీరమల్లు' సినిమాలో చూపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మీసం తిప్పడం, తొడ కొట్టి ఫైట్ చేసే సన్నివేశాలుంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. మామూలుగా పవన్‌కళ్యాణ్‌ను చూస్తే ఊగిపోయే ఫ్యాన్స్‌ను ఇలాంటి సన్నివేశాలతో ఆపడం మరింత కష్టమవుతుందనడంలో సందేహం లేదు.
మొఘల్ కాలం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న 'హరిహర వీరమల్లు'లో పవన్‌కల్యాణ్ పేద ప్రజలకు అండగా నిలిచే బందిపోటు పాత్రలో కనిపిస్తారు. బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ ఇందులో ఔరంగజేబు పాత్రలో కనిపించనున్నాడు. నిధి అగర్వాల్, జాక్వలైన్ ఫెర్నాండెజ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.