Abn logo
Mar 29 2020 @ 23:15PM

సినిమా కుటుంబానికి ధన్యవాదాలు: పవన్ కల్యాణ్

కరోనా మహహ్మారి విజృభించిన ఆపత్కాలమిది. ఈ సమయంలో ప్రభుత్వానికి, ప్రజలకు, సినీ కార్మిక లోకానికి అండగా నిలిచి పెద్ద మనసు చాటుకుంటున్న సినిమా కుటుంబానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు, లాక్‌డౌన్ తరుణంలో ఇక్కట్లలో ఉన్నవారికి బాసటగా నిలిచేందుకు నిధులు చాలా అవసరమని తెలిపిన ఆయన భూరి విరాళం ప్రకటించిన అక్షయ్ కుమార్‌కు, అలాగే సిసిసి (కరోనా క్రైసిస్ చారిటీ) స్థాపించి ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకుంటున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ సంస్థకు ఇప్పటి వరకు విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరి పేరును తెలియజేస్తూ వారికి అభినందనలు తెలిపారు. 




Advertisement
Advertisement
Advertisement