పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘భీమ్లా నాయక్, హరి హరవీరమల్లు’ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. చివరి దశలో ఉన్న ‘భీమ్లానాయక్’ సినిమా షూట్‌ను వీలైనంత త్వరగా ముగించి.. క్రిష్ ‘హరిహర వీరమల్లు’ బ్యాలెన్స్ షూటింగ్‌ను ఫిబ్రవరిలో ప్రారంభించబోతున్నారు. తర్వాత హరీశ్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’, సురేంద్ర రెడ్డి చిత్రాలు లైన్ లో ఉన్నాయి. అయితే ఈ సినిమాల విషయంలో పవన్ దర్శక, నిర్మాతలకు కొత్త షరతులు విధించారని సమాచారం. ఈ రెండు సినిమాల్ని కేవలం 60రోజుల్లోనే ముగించాలని కండిషన్స్ పెట్టారట. ఈ క్రమంలో కేవలం రెండు నెలల్లోనే హరీశ్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రాన్ని కంప్లీట్ చేయబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం అఖిల్ తో ‘ఏజెంట్’ చిత్రాన్ని తీస్తున్న సురేంద్ర రెడ్డి.. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత పవర్ స్టార్ తో రెండు నెలల్లో సినిమాను పూర్తి చేస్తారట.
ఈ రెండు సినిమా షూటింగ్స్ ను ఈ సంవత్సరం లోనే కంప్లీట్ చేయాలని పవర్ స్టార్ పట్టుదలతో ఉన్నారట. 2023 నుంచి ఆయన పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితమవ్వాలని నిర్ణయించుకున్నారట. 2024 లో జరగబోయే ఎన్నికల కోసం పవన్ ఇప్పటి నుంచి పక్కా ప్రణాళికతో ఉన్నారట. ప్రస్తుతం కమిట్ అయిన సినిమాల వల్లనే ఆయన రాజీకీయాల్లో పూర్తి స్థాయిలో యాక్టివ్ గా ఉండలేకపోతున్నారు. అందువల్లనే నిర్మాతలకు పవన్ కొత్త కండీషన్స్ పెట్టారట. ‘భీమ్లానాయక్, హరిహర వీరమల్లు’ చిత్రాలు ఈ ఏడాది విడుదలైతే, మిగతా రెండు సినిమాలు 2023లో విడుదలయ్యేలా పవర్ స్టార్ ప్లాన్ చేశారట. మరి ఆయన అనుకున్నట్టుగానే జరుగుతుందో లేదో చూడాలి.