అమరావతి: గులాబ్ తుపాను బాధితులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సుమారు 2 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. నామ మాత్రపు సాయంతో సరిపెట్టవద్దు అని సూచించారు. రైతులు, కౌలు రైతులు కోలుకోవాలన్నారు. ఎకరానికి 25 నుండి 30 వేలు ఇస్తేనే రైతులు కోలుకోగలరని చెప్పారు.