అమరావతి: వరదలపై జనసేన ముఖ్యనేతలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద బాధితులను ఆదుకునేందుకు సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు. ప్రజలు కష్టాల్లో ఉంటే.. ప్రభుత్వం నుంచి స్పందన కరువైందన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రజల పక్షాన నిలుస్తామని చెప్పారు. ప్రజాధనంతో ప్రభుత్వం స్థాపించిన వాలంటీర్ల వ్యవస్థ ఎన్నికల కోసం మాత్రమే పనిచేస్తోందన్నారు. ఇకనైనా వాలంటీర్లు వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు.