Sep 23 2021 @ 20:33PM

మేనల్లుడి కోసం వేదికపైకి పవన్‌కల్యాణ్‌!

ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన హీరో సాయితేజ్‌ చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. మరోవైపు ఆయన కథానాయకుడిగా నటించిన ‘రిపబ్లిక్‌’ చిత్రం ప్రమోషన్‌ పనులు మొదలయ్యాయి. తాజాగా చిరంజీవి ఈ చిత్రం ట్రైలర్‌ను మెగాస్టార్‌ చిరంజీవి విడుదల చేశారు. ఇప్పుడు చిత్ర బృందం మెగా అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇవ్వనుంది. ఈ నెల 25న జరగనున్న ప్రీ రిలీజ్‌ వేడుకకు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ను అతిథిగా ఆహ్వానించారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పవన్‌ కల్యాణ్‌ను చాలాకాలం తర్వాత వేదికపై చూడటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. దేవకట్టా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జె.భగవాన్‌–పుల్లారావు నిర్మిస్తున్నారు. వచ్చే నెల ఒకటో తేదీన చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.