Chitrajyothy Logo
Advertisement
Published: Mon, 24 Jan 2022 08:51:05 IST

Pawan kalyan: సినిమాలను హోల్డ్‌లో పెట్టారా..?

twitter-iconwatsapp-iconfb-icon
Pawan kalyan: సినిమాలను హోల్డ్‌లో పెట్టారా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాలను హోల్డ్‌లో పెట్టారా..? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వార్త వచ్చి చక్కర్లు కొడుతోంది. దాదాపు మూడేళ్ల విరామం తరువాత 'వకీల్ సాబ్' మూవీతో ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ప్రారంభం అవుతున్న దశలోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌ను సాధించింది. ఈ మూవీ తర్వాత పవన్ వరుసగా భారీ ప్రాజెక్టులను లైన్‌లో పెటారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించిన 'భీమ్లా నాయక్' సినిమాలో నటిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సంబంధించిన కొద్దిపాటి టాకిపార్ట్ మినహా మిగతా చిత్రీకరణ మొత్తం పూర్తైంది.

Pawan kalyan: సినిమాలను హోల్డ్‌లో పెట్టారా..?

దీని తర్వాత క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న పాన్ ఇండియన్ సినిమా 'హరిహర వీరమల్లు'. ఇప్పటికే దాదాపు సగానికి పైగా షూటింగ్ పూర్తైన ఈ సినిమా సెకండ్ వేవ్ సమయంలో పవన్ కరోనా బారిన పడటంతో ఆగిపోయింది. మళ్ళీ తిరిగి సెట్స్ మీదకు తీసుకురావాలనుకుంటున్న సమయంలో థర్డ్ వేవ్ మొదలై రోజు రోజుకు లెక్కకు మించి పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీన్ని దృష్ఠిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఇప్పట్లో షూటింగ్స్ ఏవీ పెట్టొద్దని దర్శక, నిర్మాతలకు సూచించారట. కొద్దిపాటి చిత్రీకరణ పూర్తి చేయాల్సిన 'భీమ్లా నాయక్' తప్ప మిగతా సినిమాల షూటింగ్‌లో జాయిన్ కాలేనని పవన్ చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. మళ్ళీ పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాతే తాను కమిటయిన చిత్రాల షూటింగ్‌లో పాల్గొంటారట. ఇక ఈ ఖాళీ సమయాన్ని తన పొల్టికల్ వ్యవహారాల కోసం కేటాయించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక ఫిబ్రవరి 25న రిలీజ్ కావాల్సిన 'భీమ్లా నాయక్' మరోసారి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నట్టు చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement