AP News: రాజకీయాల్లో నాతో పవన్‌ నడవగలరా?: ధర్మాన

ABN , First Publish Date - 2022-08-09T02:22:11+05:30 IST

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) రాజకీయంగా నడుస్తామంటున్నారు. అది సాధ్యమా? మూడు కిలో మీటర్లయినా రాజకీయాల్లో నాతో నడవగలరా? అని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి

AP News: రాజకీయాల్లో నాతో పవన్‌ నడవగలరా?: ధర్మాన

శ్రీకాకుళం: ‘‘పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) రాజకీయంగా నడుస్తామంటున్నారు. అది సాధ్యమా? మూడు కిలో మీటర్లయినా రాజకీయాల్లో నాతో నడవగలరా? అని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao) ప్రశ్నించారు. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం శ్రీకాకుళం జిల్లా గార మండలం లింగాలవలసలో మంత్రి ధర్మాన ప్రసాదరావు  పర్యటించారు. అక్కడ సమీపంలో కొంతమంది యువకులు తమ ఫొటోలతోపాటు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీన్ని గమనించిన మంత్రి ధర్మాన అసహనానికి గురయ్యారు. ప్రజలకోసం ప్రభుత్వం పనిచేస్తుందని.. దీన్ని గుర్తించాలని.. పోస్టర్లపై ఫోజులిచ్చి ఫొటోలు దిగే సినిమావారితో ప్రయోజనం ఉండదని మంత్రి వ్యాఖ్యానించారు. నిజజీవితం వేరు.. సినిమా వేరని, ఒడిదుడుకులు ఉండేది రాజకీయాల్లో మాత్రమే అని చెప్పారు. సినిమాల్లో బొమ్మలుపెట్టి యాక్షన్‌ చేస్తారని చెప్పారు. తనకిప్పుడు 64 ఏళ్లని.. అధికారంతో సంబంధం లేకుండా 45 ఏళ్లపాటు ప్రజాజీవితంలోనే ఉన్నానని ధర్మాన ప్రసాదరావు తెలిపారు. 

Updated Date - 2022-08-09T02:22:11+05:30 IST