May 4 2021 @ 23:59PM

ఫస్ట్ టైమ్: బుల్లితెరపైకి పవన్ కల్యాణ్ కూతురు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూతురు ఆద్య ఫస్ట్ టైమ్ బుల్లితెరపై దర్శనమివ్వబోతోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బుల్లితెరపై ప్రసారమవుతున్న డ్రామా జూనియర్స్ కార్యక్రమానికి ఆద్య గెస్ట్‌గా హాజరైంది. మదర్స్ డే స్పెషల్‌గా ప్రసారం కాబోతోన్న ఈ ఎపిసోడ్‌లో అందరి దృష్టిని ఆకర్షించడానికి జీ తెలుగు ఛానల్ వారు ఆద్యను గెస్ట్‌గా ఆహ్వానించారు. ఇక తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఆద్యకు.. యాంకర్ రవి ఫస్ట్ టైమ్ అంటూ భారీ వెల్‌కమ్ పలుకగా.. ఈ షోకి జడ్జ్‌గా వ్యవహరిస్తున్న రేణు దేశాయ్ తన కూతుర్ని చూసి.. ఆనందమయమైంది. వెంటనే స్టేజ్ పైకి వచ్చి.. ఆద్యను హగ్ చేసుకుంది. ఈ సన్నివేశాలతో ఉన్న ఈ ప్రోమో ఇప్పుడు నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. రేణు దేశాయ్‌తో పాటు సింగర్ సునీత, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఈ షో కి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఫుల్ ఎపిసోడ్ మే 9న ప్రసారమవుతుందని ‘జీ తెలుగు’ ప్రకటించింది.