Apr 16 2021 @ 23:28PM

నా ఆరోగ్యం నిలకడగానే ఉంది: పవన్‌ కల్యాణ్‌

నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు జనసేన పార్టీ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. తన వ్యక్తిగత సిబ్బందిలో కొందరికి కరోనా రావటంతో వారం రోజుల నుంచి పవన్‌ కల్యాణ్‌ ఫామ్‌హౌ్‌సలో స్వీయ నిర్బంధంలో ఉన్నారు. రెండు రోజుల క్రితం జరిపిన వైద్య పరీక్షల్లో కొవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలు, అభిమానుల ముందుకు వస్తానని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు.