విజయవాడ: సంచలనం రేకెత్తించి.. జనంలో చర్చకు దారితీసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై బీజేపీ మౌనం వహించింది. బీజేపీలోని ఆ నలుగురికి కామెంట్స్ ఎంతమాత్రం నచ్చలేదని సమాచారం. పవన్ చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలని బీజేపీ నేత నాగోతు రమేష్ నాయుడు మినహా మరెవ్వరు వాటిపై నోరువిప్పలేదు. పవన్ చేసిన విమర్శలను ఇప్పటికే అధికారపార్టీ నేతలు తిప్పికొట్టారు. జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ అగ్రనేతలు మాత్రం మిత్రుడి కోసం ముందుకు రాలేదు. ఇప్పటికే రెండు పక్షాల మధ్య పెరుగుతున్న దూరం.. తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలు బీజేపీలో కొంతమందిని ఇరుకున పడేలా చేశాయి.