Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sun, 26 Sep 2021 14:26:19 IST

మేం సన్యాసులమైతే Pawan Kalyan రుషి పుంగవుడా?.. మంత్రి బొత్స ఘాటు వ్యాఖ్యలు

twitter-iconwatsapp-iconfb-icon
మేం సన్యాసులమైతే Pawan Kalyan రుషి పుంగవుడా?.. మంత్రి బొత్స ఘాటు వ్యాఖ్యలు

విజయనగరం: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ముకుమ్మడి దాడికి దిగారు. పవన్‌ వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము సన్యాసులమైతే పవన్ రుషి పుంగవుడా అని ప్రశ్నించారు. ‘‘మాకు తాట తీస్తాడా.. చూస్తాం.. ఆన్‌లైన్ విధానాన్ని సినీ పెద్దలందరూ అంగీకరించారు.  ప్రభుత్వం స్వేచ్ఛ ఇచ్చింది కదా అని చెలరేగిపోతే ... ఎలా కట్టడి చేయాలో మాకూ తెలుసు. సినీ పరిశ్రమ అంటే పవన్ కల్యాణ్ ఒక్కరేనా?’’ అని బొత్స ప్రశ్నించారు. మంత్రివర్గంలో చేర్పులు మార్పులు, కూర్పులు ఉంటే అది పూర్తిగా ముఖ్యమంత్రి జగన్ ఇష్టంపై ఆధారిపడి ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. గులాబ్ తుఫాన్ తీవ్రతపై ప్రభుత్వ యంత్రాంగాన్నిఅప్రమత్తం చేశామని బొత్స సత్యనారాయణ తెలిపారు.


అంతకుముందు పవన్ వ్యాఖ్యలపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ‘‘పవన్‌కల్యాణ్ నటించినా, సంపూర్ణేష్ బాబు నటించినా కష్టం ఒకటే. ఆన్‌లైన్ టికెట్ల పోర్టల్ గురించి చిత్ర పరిశ్రమలోని కొందరు ప్రముఖులే ప్రభుత్వ పెద్దలతో చర్చించారు. ఆన్‌లైన్ పోర్టల్ అంటే ఎందుకంత భయం? దాని వల్ల జరిగే నష్టం ఏమిటి? అకౌంటబులిటీ రావాలన్నదే సీఎం ఆలోచన. పారదర్శకత కోసమే ఆన్‌లైన్ పోర్టల్. అందరికీ టికెట్ ధర ఒకేలా ఉండాలనేదే మా ఉద్దేశం. సినిమా ఖర్చులో కేవలం నలుగురైదుగురికి మాత్రమే లబ్ధి ఎక్కువగా ఉంటుంది. ఇది ఎంతవరకు సబబు. నా ఒక్కడి కోసం చిత్రసీమని వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని పవన్ కల్యాణ్ మాట్లాడడం సరికాదు’’ అని అనిల్ యాదవ్ హెచ్చరించారు.

 

ఏపీ సర్కారు కొత్త అప్పుల కోసమే సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించాలనుకుంటోందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. ప్రైవేటు వ్యక్తులు తీసే సినిమాపై ప్రభుత్వ ఆధిపత్యం ఏమిటని ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ‘రిపబ్లిక్‌’ సినిమా ప్రీరిలీజ్‌ వేడుకలో పవన్‌ పాల్గొన్నారు. ఏపీ సర్కారుపై, వైసీపీ తీరుపై విరుచుకుపడ్డారు. ‘‘హీరోలు, దర్శకులు, హీరోయిన్లు కోట్లు తీసుకుంటారని అంటుంటారు. అరేయ్‌ సన్నాసుల్లారా... దద్దమ్మల్లారా! ఇవి దోచుకున్న డబ్బులు కాదు. కష్టపడితే వచ్చే డబ్బులు. కాంట్రాక్టులతో, అవినీతితో సంపాదించింది కాదు. పన్నులు కూడా కడుతున్నాం. వైసీపీ వాళ్లు ఏం చేస్తారు? ఆస్థాన విద్వాంసులతో ‘ఈ గంట గడిస్తే చాలు. ఓ అరగంట వస్తే చాలు. పట్టుమని పది నిమిషాలు. చప్పున వస్తా, ఇట్టే చల్లారిపోతా’ వంటి టైటిల్స్‌తో సినిమాలు తీసి... కాకినాడలోని చాణక్య చంద్రగుప్తా మీ ఎమ్మెల్యే హాలులో రిలీజ్‌ చేసుకోండి’’ అని పవన్‌కల్యాణ్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.