Jul 27 2021 @ 16:34PM

Glimpse: ఖాకీ డ్రస్సులో పవర్ స్టార్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో నటిస్తోన్న ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ చిత్ర షూటింగ్ పున:ప్రారంభమైన విషయం తెలిసిందే. సెట్స్‌లో పవన్ కల్యాణ్ ఖాకీ డ్రస్సులో ఉన్న పిక్ సోమవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పున:ప్రారంభమైనట్లుగా తెలుపుతూ.. చిత్రయూనిట్ ఓ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ వీడియోలో పవన్ కల్యాణ్‌తో పాటు రానా దగ్గుబాటి కూడా షూట్‌లో జాయిన్ అయినట్లుగా చూపించారు. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సజెషన్స్ ఇస్తున్నట్లుగా వీడియోలో చూపించారు. వీడియో చివరిలో సంక్రాంతికి భీమ్లా నాయక్‌గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాబోతున్నట్లుగా చూపించి, విడుదలపై కూడా క్లారిటీ ఇచ్చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.